SIR: ఎస్ఐఆర్ గడువు 7 రోజులు పొడిగింపు.. ఈసీ కీలక నిర్ణయం
ABN , Publish Date - Nov 30 , 2025 | 02:46 PM
ప్రస్తుతం ఎస్ఐఆర్ రెండో దశ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో జరుగుతోంది.
న్యూఢిల్లీ: పన్నెండు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియను ఏడు రోజులు పొడిగిస్తూ భారత ఎన్నికల కమిషన్ (ECI) నిర్ణయం తీసుకుంది. ఓటర్లు తమ వివరాలను తనిఖీ చేసుకునేందుకు, అప్‌డేట్ చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ముసాయిదా ఎన్నికల జాబితా డిసెంబర్ 9వ తేదీకి బదులుగా డిసెంబర్ 16న విడుదల అవుతుంది. తుది ఓటర్ల జాబితా 2026 ఫిబ్రవరి 7వ తేదీకి బదులుగా ఫిబ్రవరి 14న విడుదలవుతుంది.

ప్రస్తుతం ఎస్ఐఆర్ రెండో దశ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో జరుగుతోంది. తొలి విడత ఎస్ఐఆర్ బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెప్టెంబర్‌లో పూర్తయింది.
ఎన్నికల జాబితా ఎస్ఐఐర్ రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం, ఎన్యూమరేషన్ పీరియడ్ డిసెంబర్ 11వ తేదీకి మారింది. రేషనలైజేషన్, రీ అరేంజ్‌మెంట్ ఆఫ్ పోలింగ్‌స్టేషన్స్ గడువు డిసెంబర్ 11వ తేదీ వరకూ ఉటుంది. కంట్రోల్ టేబుల్ అప్డేషన్, ముసాయిదా జాబితా ప్రక్రియ డిసెంబర్ 12-15 వరగూ జరుగుతుంది. ముసాయిదా ఓటర్ల జాబితా డిసెంబర్ 16న ప్రచురితమవుతుంది. క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రకటనకు డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 15వ తేదీ వరకూ గడువు ఉంటుంది. నోటీస్ ఫేజ్ డిసెంబర్ 16 నుంచి 2026 ఫిబ్రవరి 7 వరకూ ఉంటుంది. ఫిబ్రవరి14న తుదిజాబితా విడుదలవుతుంది.
ఇవి కూడా చదవండి..
బీఎల్ఓల పరిహారం రెట్టింపు.. ఈసీ నిర్ణయం
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిల పక్షం భేటీ..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి