Share News

Union Cabinet: తిరుపతి-పాకాల-కాట్పడి మధ్య రైల్వే లైన్ డబ్లింగ్‌.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

ABN , Publish Date - Apr 09 , 2025 | 06:08 PM

తిరుపతి-పాకాల-కాట్పడి మధ్య సుమారు రూ.1,332 కోట్ల ఖర్చుతో 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఇందువల్ల 400 గ్రామాలు, 14 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

Union Cabinet: తిరుపతి-పాకాల-కాట్పడి మధ్య రైల్వే లైన్ డబ్లింగ్‌.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) నుంచి తమిళనాడు (Tamilnadu) వరకూ 104 కిలోమీటర్ల తిరుపతి-పాకాల-కాట్పడి సింగిల్ రైల్వే లేన్ సెక్షన్ నిర్మాణానికి నిర్ణయించింది. ఇందుకోసం రూ.1,332 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారంనాడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు.

Union Cabinet: సీఏడీడబ్లూఎం పథకానికి కేబినెట్ ఆమోదం


తిరుపతి-పాకాల-కాట్పడి మధ్య సుమారు రూ.1,332 కోట్ల ఖర్చుతో 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఇందువల్ల 400 గ్రామాలు, 14 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి కనెక్టివిటీ పెరగడంతో పాటు, ఇతర ప్రముఖ ప్రాంతాలైన శ్రీకాళహస్తి శివాలయం, కానిపాక వినాయక ఆలయం, చంద్రగిరి ఫోర్ట్‌కు రైలు కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. దీంతో పర్యాటకులు కూడా పెరుగుతారని చెప్పారు. ఏడాదికి నాలుగు మిలియన్ టన్నుల సరకు రవాణా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో 35లక్షల పనిదినాలతో నిరుద్యోగుల ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు. ప్రధానమంత్రి 'అత్మనిర్భర్', 'న్యూ ఇండియా' విజన్‌కు ఈ తాజా నిర్ణయం మరింత ఊతమిస్తుందని మంత్రి తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Tahwwur Rana: భారత్‌కు 26/11 పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా.. ప్రత్యేక విమానంలో తరలింపు

Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..

Updated Date - Apr 09 , 2025 | 06:15 PM