Share News

Delhi Gas Accident: ఏసీ గ్యాస్ లీకేజీతో ముగ్గురు మెకానిక్‌లు మృతి.. ఒకరి పరిస్థితి విషమం..

ABN , Publish Date - Jul 05 , 2025 | 08:26 PM

ఢిల్లీలోని దక్షిణపురి ప్రాంతంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. బతుకుతెరువు కోసం సొంతూరు విడిచి వచ్చిన యువకులను ఊహించని విధంగా మరణం కాటేసింది.

Delhi Gas Accident: ఏసీ గ్యాస్ లీకేజీతో ముగ్గురు మెకానిక్‌లు మృతి.. ఒకరి పరిస్థితి విషమం..
AC Mechanics Found Dead Delhi

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని దక్షిణపురి ప్రాంతంలో ఘోర ప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని అంబేడ్కర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో ఏసీ గ్యాస్ లీకై ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా ఊపిరాడకపోవడం వల్లే మృతిచెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.


మృతులు బరేలీ జిల్లా సనైయా రాణి మేవకున్వర్ కు చెందిన 25 ఏళ్ల ఇమ్రాన్ అలియాస్ సల్మాన్, 17 ఏళ్ల అంకిత్ రస్తోగి అలియాస్ కపిల్, 25 ఏళ్ల మొహ్సిన్ గా గుర్తించారు. వీరంతా ఏసీ మెకానిక్‌లుగా పనిచేస్తూ ఒకే గదిలో అద్దెకు నివసిస్తున్నారు. బందియా నివాసి అయిన 28 ఏళ్ల హసీబ్ ప్రస్తుతం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.


ఏసీ గ్యాస్ లీకేజీ వల్లే ప్రమాదం..

మృతులు ముగ్గురూ, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ఏసీ రిపేర్లు చేస్తారు. వారు ఢిల్లీలోని దక్షిణపురిలో దాదాపు మూడు-నాలుగు సంవత్సరాలుగా ఒకే గదిలో నివసిస్తున్నారు. కొన్ని నెలల క్రితం సొంతూరు బరేలీకి వెళ్లి వారం క్రితమే ఢిల్లీకి తిరిగి వచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం రాత్రి నలుగురూ కలిసి భోజనం చేసి నిద్రపోయారు. రాత్రి ఏదో ఒక సమయంలో గదిలోని ఏసీ నుంచి గ్యాస్ లీక్ అయింది. కిటికీలు, తలుపులు మూసివేయడం వల్ల గది గ్యాస్‌తో నిండిపోయి నలుగురూ ఊపిరాడక చనిపోయారు.


ఇవి కూడా చదవండి:

అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. దేశ ప్రయోజనాలే ముఖ్యమన్న కేంద్ర మంత్రి

షాకింగ్ రోడ్డు ప్రమాదం.. స్కార్పియో కారు అదుపు తప్పి బిల్ బోర్డు స్తంభాన్ని ఢీకొట్టడంతో..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 05 , 2025 | 09:58 PM