-
-
Home » Mukhyaamshalu » today Breaking Viral and trending Telangana Andhra Pradesh news to national and international on 6th nov 2025 kjr
-
BREAKING: బిహార్.. పోలింగ్ సందర్భంగా లక్కీసరాయిలో ఉద్రిక్తత..
ABN , First Publish Date - Nov 06 , 2025 | 06:18 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 06, 2025 15:18 IST
బిహార్: పోలింగ్ సందర్భంగా లక్కీసరాయిలో ఉద్రిక్తత..
డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా కాన్వాయ్‌పై రాళ్లదాడి
ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు
-
Nov 06, 2025 14:05 IST
ఐపీఎస్ సంజయ్ కేసు విచారణ వాయిదా
విజయవాడ : ఐపీఎస్ సంజయ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ కోర్టు.
తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా వేసిన విజయవాడ ఏసీబీ కోర్టు.
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో సంజయ్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ.
ప్రస్తుతం విజయవాడలోని జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంజయ్
-
Nov 06, 2025 13:07 IST
బండి సంజయ్ మీటింగ్‌కు.. అనుమతి నిరాకరణ
బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్‌కు అనుమతి రద్దు చేసిన పోలీసులు
షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం బోరబండలో కొనసాగాల్సిన మీటింగ్
పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణుల మండిపాటు..
అనుమతి ఇచ్చి రద్దు చేయడమేంటని ప్రశ్నించిన బీజేపీ ఎన్నికల ఇంచార్జి ధర్మారావు
సాయంత్రం బోరబండలోనే మీటింగ్ జరిపి తీరుతామని స్పష్టీకరణ
బీజేపీ శ్రేణులంతా భారీ ఎత్తున తరలిరావాలని పిలుపు
ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచన
-
Nov 06, 2025 12:57 IST
అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు
మరోసారి వ్యాపార వేత్త అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు
నవంబర్ 14వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు
రుణాల ఎగవేత కేసులో ఈడీ కేసు విచారణ
-
Nov 06, 2025 12:21 IST
చీమల ఫోబియాతో గృహిణి ఆత్మహత్య..
సంగారెడ్డి జిల్లాలో చీమల ఫోబియాతో ఓ గృహిణి ఆత్మహత్య..
అమీన్‌పూర్ మున్సిపాలిటీ లోని శర్వా హోమ్స్‌లో మనీషా ఉరి వేసుకొని ఆత్మహత్య..
చీమల ఫోబియాతో చనిపోతున్నట్టు తన కూతురు జాగర్త అంటూ సూసైడ్ నోట్..
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
-
Nov 06, 2025 12:18 IST
27 శాతం నమోదైన పోలింగ్
బీహార్‌లో కొనసాగుతున్న మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
121 అసెంబ్లీ స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్
ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం నమోదైన పోలింగ్
పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు.
-
Nov 06, 2025 11:06 IST
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం నితీష్ కుమార్
బీహార్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం నితీష్ కుమార్
ఎన్నికల మొదటి దశ ఓటింగ్‌ను పర్యవేక్షిస్తున్న ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్
ప్రతి పోలింగ్ బూత్‌ను నిశితంగా పరిశీలిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం
-
Nov 06, 2025 10:00 IST
డ్రగ్స్ ఓవర్ డోస్‌తో వ్యక్తి మృతి
రాజేంద్రనగర్‌లో డ్రగ్స్ ఓవర్ డోస్‌తో వ్యక్తి మృతి
ఒక అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్ సేవించిన అలీ అనే వ్యక్తి..
డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతో మృతి చెందిన అలీ..
మొబైల్ రిపేర్ బిజినెస్ చేస్తున్న అలీ.
-
Nov 06, 2025 09:20 IST
ఓటు హక్కు వినియోగించుకున్న తేజస్వి యాదవ్
కొనసాగుతున్న బీహార్ ఎన్నికల పోలింగ్..
ఓటు హక్కు వినియోగించుకున్న మహాఘట్బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్..
ప్రతి ఒక్కరు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసిన తేజస్వి..
మార్పు, అభివృద్ధి కోసం, ఉద్యోగాల కోసం ఓటు వేయాలని పిలుపు.
-
Nov 06, 2025 07:48 IST
కత్తిపోట్లకు గురైన రౌడీషీటర్ మృతి
హైదరాబాద్: జగద్గిరిగుట్టలో నడిరోడ్డుపై కత్తిపోట్లకు గురైన రౌడీషీటర్ మృతి
జగద్గిరిగుట్ట బస్టాండ్ దగ్గర రోషన్ సింగ్‌పై బాల్‌రెడ్డి అనే మరో రౌడీషీటర్ కత్తితో దాడి
గాయాలపాలైన రోషన్ సింగ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి.
-
Nov 06, 2025 07:34 IST
లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
బాపట్ల బాపట్ల గడియార స్థంభం సెంటర్‌లో రోడ్డు ప్రమాదం..
తెల్లవారుజామున లారీని ఢీకొని ఇద్దరు యువకులు మృతి..
సూర్యలంక బీచ్‌కు వచ్చిన గుంటూరుకు చెందిన ఇద్దరు యువకులు..
బీచ్‌లో అనుమతి నిరాకరణతో తిరిగి వెళ్తుండగా.. లారీని ఢీకొన్న బైక్..
షేక్ జాన్ (22), నాని(20)లు మృతి..
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బాపట్ల పట్టణ పోలీసులు.
-
Nov 06, 2025 07:21 IST
బీహార్ అసెంబ్లీ మొదటి దశ పోలింగ్ ప్రారంభం
కాసేపటి క్రితమే ప్రారంభమైన బీహార్ అసెంబ్లీ పోలింగ్
మొదటి విడతలో 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్
మొదటి విడత 121స్థానాలకు బరిలో ఉన్న 1,314 మంది అభ్యర్థులు
మొదటి విడత పోలింగ్‌లో పలువురు కీలకనేతలు ఆర్జేడీ నేత సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, విజయ్ కుమార్ సిన్హా, సామ్రాట్ చౌదరి
5 కోట్ల మంది ఓటర్లకు వోటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ (వీఐఎస్) పంపిన ఎన్నికల సంఘం
మొత్తం 50,000కి పైగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు.
వీటిలో 1,000కి పైగా మహిళల కోసం పనిచేసే ప్రత్యేక బూత్లు ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం