-
-
Home » Mukhyaamshalu » Today Breaking News MLC Election Counting in AP and Telangana Actor Posani Arrest Live Updates Thursday 03rd march 2025 NDN
-

Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Mar 03 , 2025 | 11:55 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-03-03T21:57:52+05:30
ఘోర రోడ్డుప్రమాదం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
భూపాలపల్లి మండలం రాంపూర్-కమలాపూర్ మధ్య ఎదురెదురుగా ఢీకొన్న ద్విచక్రవాహనాలు
ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి
మృతులు మీనాజీపేటకు చెందిన పింగిలి రాజిరెడ్డి, లడ్డూ గుర్తింపు
అలాగే మరొక మృతుడు పంబాపూర్‌కు చెందిన సతీశ్‌గా గుర్తింపు
-
2025-03-03T21:32:35+05:30
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎవరు గెలిచారంటే..
విశాఖ: ముగిసిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
పీఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు ఘన విజయం
రెండో ప్రాధాన్యత ఓటుతో గెలుపొందిన గాదె శ్రీనివాసులు నాయుడు
మొత్తం పొలైన ఓట్లు 20,791 కాగా, చెల్లిన ఓట్లు 20,135, చెల్లని ఓట్లు 656
గాదె శ్రీనివాసులు నాయుడుకు మెుత్తం పోలైన ఓట్లు 12,035
మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్న ఎన్నికల అధికారులు
గతంలో రెండు పర్యాయాలు టీచర్స్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు నాయుడు ఎన్నిక
మూడోసారీ టీచర్స్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు నాయుడు విజయ కేతనం
మరికాసేపట్లో మీడియా ముందుకు రానున్న గాదె శ్రీనివాసులు నాయుడు
-
2025-03-03T21:17:14+05:30
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడి..
కరీంనగర్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగరవేసిన బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య
12,959 ఓట్లతో భారీ విజయం కైవసం చేసుకున్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్య
12,081 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ దాటిన కొమురయ్య
మరో ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డికి 7,182 ఓట్లు
ఇంకో ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ కుమార్‌కు పోలైన ఓట్లు 2,621
మరో అభ్యర్థి కూర రఘోత్తమ్ రెడ్డికి 428 ఓట్లు
అలాగే నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీపాల్‌రెడ్డి విజయం
టీచర్స్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి గెలుపు
-
2025-03-03T21:08:52+05:30
పోసాని కృష్ణమురళి కేసులో కీలక మలుపు..
కడప: పోసాని కృష్ణమురళీని 5 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసిన ఓబులవారిపల్లె పోలీసులు
కడప కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన ఓబులవారిపల్లె పోలీసులు, విచారణ ఎల్లుండికి వాయిదా
పోసాని కృష్ణమురళీకి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు
బెయిల్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా వేసిన కడప కోర్టు
రైల్వేకోడూరు మేజిస్ట్రేట్ సెలవులో ఉన్న కారణంగా కడప కోర్టులో పిటిషన్లు దాఖలు
-
2025-03-03T20:56:23+05:30
మరో భారీ ఎన్‌కౌంటర్.. దద్దరిల్లిన ఛత్తీస్‌గఢ్ అడవులు..
ఛత్తీస్‌గఢ్: ధామ్‌తారి జిల్లా మాదగిరి అడవుల్లో మరో భారీ ఎన్‌కౌంటర్
డీజీఆర్ సైనికులు, మావోయిస్టుల మధ్య భీకరంగా కొనసాగుతున్న ఎదురుకాల్పులు
ఇరువర్గాల ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతి, మరికొందరికి తీవ్రగాయాలు
ఖల్లారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదగిరి అడవుల్లో నక్సల్ ఉన్నారని సమాచారం
సమాచారం అందుకున్న డీజీఆర్ భద్రతా దళాలు నక్సల్స్ శిబిరంపై దాడి, ధ్వంసం
దాడి సమయంలో 25 నుంచి 30 మంది మావోలు శిబిరం వద్ద ఉన్నట్లు సమాచారం
మాదగిరి అడవుల్లో కొనసాగుతున్న భద్రతా బలగాల ఆపరేషన్
-
2025-03-03T20:38:26+05:30
సీఎం చంద్రబాబు కాన్వాయ్ ఆపిన ఓ చిట్ ఫండ్ సంస్థ బాధితులు
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన నరసరావుపేట సాయిసాధన చిట్ ఫండ్ బాధితులు
బాధితులను చూసి కాన్వాయ్ ఆపి వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
సాయిసాధన చిట్ ఫండ్ సంస్థ రూ.250 కోట్లకు శఠగోపం పెట్టిందని సీఎం ఎదుట వాపోయిన బాధితులు
సంస్థ మోసంతో దాదాపు 600 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని ఆవేదన
40 రోజుల క్రితమే చిట్ ఫండ్స్ యజమాని పాలడుగు పుల్లారావు కోర్టులో లొంగిపోయారని వెల్లడి
తమకు న్యాయం చేయాలంటూ సీఎం చంద్రబాబుకు మొరపెట్టుకున్న చిట్ ఫండ్ సంస్థ బాధితులు
దాదాపు 10 నిమిషాలపాటు ఓపిగ్గా రోడ్డుపైనే వారి గోడు విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజల్ని మోసం చేసిన వాళ్లు కోర్టులో లొంగిపోయామంటే సరిపోదంటూ సీఎం ఆగ్రహం
బాధితులకు పూర్తి న్యాయం చేసే వరకూ వదిలేది లేదని హెచ్చరిక
అన్ని విధాలా ఆదుకునే దిశగా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ
-
2025-03-03T20:10:45+05:30
టూరిజం అధికారులపై కొరడా ఝుళిపించిన ఏపీ ప్రభుత్వం..
విశాఖ: విశాఖ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తాత్కాలికంగా నిలిపివేయడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్
ఘటనపై అధికారులను బాధ్యులుగా చేస్తూ కొరడా ఝుళిపించిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం బ్లూ ఫ్లాగ్ బీచ్ స్టాండర్డ్స్‌ను కచ్చితంగా అమలు చేస్తుందని వెల్లడి
విశాఖపట్నం డీటీవో, ఆర్డీల మధ్య సమన్వయ లోపం కారణంగా టూరిజం అభివృద్ధిపై ప్రభావం పడినట్టు గుర్తింపు
వారి మధ్య అంతర్గత విభేదాల కారణంగా బాధ్యతలను విస్మరించినట్లు గుర్తించిన ప్రభుత్వ పెద్దలు
అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో టూరిజం శాఖకు చెడ్డపేరు వచ్చిందని ఆగ్రహం
ఈ మేరకు వారిద్దరినీ బాధ్యులను చేస్తూ విధుల నుంచి తక్షణమే తప్పిస్తూ ఆదేశాలు జారీ
డివిజనల్ మేనేజర్ జగదీశ్‌కు రీజినల్ డైరెక్టర్ కె.రమణ స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం
తక్షణం కె.రమణ తన బాధ్యతలను జగదీశ్‌కు అప్పగించాలని ఆదేశాలు జారీ
డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ జ్ఞానవాణిని కూడా తక్షణమే విధుల నుంచి తప్పిస్తూ మాతృశాఖకు బదిలీ
కె.జ్ఞానవాణి తన బాధ్యతలను విజయనగరం పూర్వ టూరిజం మేనేజర్ జి.దాస్‌కు అప్పగించి తప్పుకోవాలని ఆదేశం
-
2025-03-03T19:33:23+05:30
పోసాని కృష్ణ మురళీకి షాక్..
పల్నాడు: పోసాని కృష్ణమురళీకి షాక్ ఇచ్చిన నరసరావుపేట జిల్లా కోర్టు
పల్నాడు జిల్లా జడ్జి ఎదుట పోసానిని హాజరుపరిచిన నరసరావుపేట పోలీసులు
పోసాని కృష్ణమురళీకి ఈనెల 13 వరకూ రిమాండ్ విధించిన నరసరావుపేట కోర్టు
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు
టీడీపీ శ్రేణుల ఫిర్యాదు మేరకు పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్న నరసరావుపేట టూ టౌన్ పోలీసులు
విచారణ సందర్భంగా నరసరావుపేట కోర్టు వద్దకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైసీపీ శ్రేణులు
-
2025-03-03T19:14:09+05:30
తెలంగాణ సీఎం మారిపోతారు.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ ముఖ్యమంత్రి త్వరలో మారిపోతారు: బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మారారంటే ఇంకా మారేది సీఎం రేవంత్ రెడ్డే: మహేశ్వర్ రెడ్డి
రాహుల్ గాంధీ మిషన్ సీఎం ఛేంజ్ టాస్క్‌ను మీనాక్షి నటరాజన్‌కు అప్పగించారు: మహేశ్వర్ రెడ్డి
గతంలోనే నేను ఈ అంశాన్ని స్పష్టం చేశా: మహేశ్వర్ రెడ్డి
జూన్ నుంచి డిసెంబర్ లోపు సీఎం మార్పు తథ్యం: మహేశ్వర్ రెడ్డి
తెలంగాణ క్యాబినెట్‌లో కలహాలు నడుస్తున్నాయి: మహేశ్వర్ రెడ్డి
ఆడబిడ్డల ఆశీర్వాదం అంటే తెలంగాణ ఆడబిడ్డలు కాదు.. ఢిల్లీ ఆడబిడ్డ మీనాక్షి నటరాజన్ చేతిలో తన భవిష్యత్ ఉందని రేవంత్ చెప్పారు: ఏలేటి
సీఎం మార్పుపై గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికే మీనాక్షి నటరాజన్ ఇక్కడికి వచ్చారు: మహేశ్వర్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మార్చి క్యాబినెట్‌లో ఉన్న ఓ నేతకు సీఎం బాధ్యత అప్పగిస్తారు: మహేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ సర్కారుతోపాటు క్యాబినెట్ గాడి తప్పింది: మహేశ్వర్ రెడ్డి
మంత్రులు ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా ఉంది: మహేశ్వర్ రెడ్డి
ఒక్క మంత్రి కూడా తనను లెక్క చేయడం లేదని రేవంత్ రెడ్డే చెప్పుకున్నారు: మహేశ్వర్ రెడ్డి
కొందరు మంత్రులు తన కుర్చీపై కన్నేశారని, క్యాబినెట్ మంత్రులు మాట వినడం లేదని చెప్పారు: మహేశ్వర్ రెడ్డి
సీఎంను పనిచేయనీయకుండా ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసింది ఎవరు: మహేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో ఉన్న అలజడి, అపనమ్మకం, మంత్రుల మధ్య సమన్వయ లోపం లెక్కలేని తనం ఎప్పుడూ, ఏం ప్రభుత్వంలోనూ లేదు: మహేశ్వర్ రెడ్డి
-
2025-03-03T18:50:13+05:30
ఆ ఎమ్మెల్సీల ఎంపికపై చంద్రబాబు, పవన్ కసరత్తు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు చాంబర్‌కు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అసెంబ్లీ హాల్ నుంచి సీఎం చంద్రబాబుతో కలిసి చాంబర్‌కు వెళ్లిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఏపీ బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చించిన సీఎం, డిప్యూటీ సీఎం
అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నాయని అభిప్రాయపడిన పవన్
మే నెల నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపైనా చర్చించిన చంద్రబాబు, పవన్
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికపైనా ఇద్దరు నేతల మధ్య కీలక చర్చ
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపైనా సమావేశంలో చర్చించినట్లు సమాచారం
అసెంబ్లీలోని చంద్రబాబు చాంబర్‌లో దాదాపు గంటపాటు భేటీ అయిన ఇరువురు నేతలు
-
2025-03-03T18:08:02+05:30
కృష్ణా జలాల వాటాపై మంత్రి ఉత్తమ్ ఏం చెప్పారంటే..
ఢిల్లీ: కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌కు చెప్పాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తున్న అధిక జలాలను ఆపాలని కోరాం: మంత్రి ఉత్తమ్
కేంద్రం అత్యవసరంగా జోక్యం చేసుకుని ఈ అన్యాయాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి ఉత్తమ్
ఏపీ తీసుకెళ్తున్న పది వేల క్యూసెక్కుల నీటిని ఐదు వేలకు తగ్గిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు: మంత్రి ఉత్తమ్
ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పాం: మంత్రి ఉత్తమ్
ఏపీ నుంచి ఎలాంటి నివేదిక రాలేదని, ఈ అంశంలో తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు: మంత్రి ఉత్తమ్
కృష్ణా ట్రైబ్యునల్ ద్వారా తెలంగాణకు ఎక్కువ నీళ్లు ఇచ్చేలా సహకరించాలని కేంద్రాన్ని కోరాం: మంత్రి ఉత్తమ్
పాలమూరు రంగారెడ్డి, సమ్మక్కసారక్క, సీతారామసాగర్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, నిధులు ఇవ్వాలని అడిగాం: మంత్రి ఉత్తమ్
కృష్ణా నదిలో శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా ఇతర ప్రాజెక్టుల్లో టెలీ మెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలి: మంత్రి ఉత్తమ్
టెలీమెట్రీల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా ఖర్చులు కూడా మేమే భరిస్తామని చెప్పాం: మంత్రి ఉత్తమ్
ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సానుకూలంగా స్పందించారు: మంత్రి ఉత్తమ్
ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తెలంగాణకు 50 ఏళ్ల పాటు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణం ఇవ్వాలని కోరాం: మంత్రి ఉత్తమ్
మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులపై ఎన్డీఎస్ఏ- నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ నుంచి నివేదిక త్వరగా ఇవ్వాలని కోరాం: మంత్రి ఉత్తమ్
తెలంగాణ జలవనరుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, నేను కేంద్రం వద్ద మా వాదన బలంగా వినిపించాం: మంత్రి ఉత్తమ్
కృష్ణా జలాల వివాదంలో రోజువారీగా జోక్యం చేసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది: మంత్రి ఉత్తమ్
దీర్ఘకాలికంగా బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని కోరాం: మంత్రి ఉత్తమ్
తుమ్మడిహట్టి దగ్గర గతంలో కాంగ్రెస్ ప్రతిపాదించిన పనులు మొదలు పెట్టనున్నాం: మంత్రి ఉత్తమ్
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయంలోనూ కేంద్రంతో చర్చించాం: మంత్రి ఉత్తమ్
మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి భూసేకరణ విషయంలో సహకరించాలని కేంద్రాన్ని కోరాం: మంత్రి ఉత్తమ్
-
2025-03-03T17:26:43+05:30
ఎమ్మెల్యేలతో మంత్రి లోకేశ్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..
అమరావతి: ఉండవల్లి నివాసంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన మంత్రి నారా లోకేశ్
జీవో 117 ఉపసంహరణ, వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెస్తున్న సంస్కరణలపై అభిప్రాయాలు సేకరించిన లోకేశ్
జీవో 117కి ప్రత్యామ్నాయంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సూచనలు తెలుసుకున్న లోకేశ్
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 117 జీవో జారీ చేసిన జగన్ మోహన్ రెడ్డి
ఈ జీవో కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో పెద్దఎత్తున పెరిగిన డ్రాప్ ఔట్స్
జీవో 117 కారణంగా మూతపడిన పలు ప్రభుత్వ పాఠశాలలు
విద్యావ్యవస్థ ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం, మంత్రి లోకేశ్ కీలక అడుగులు
నియోజకవర్గాల్లో ఎదురవుతున్న సమస్యలను మంత్రి లోకేశ్ దృష్టికి తెచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
-
2025-03-03T16:56:59+05:30
గుంటూరు-కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్డేట్స్..
గుంటూరు: ముగిసిన గుంటూరు-కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి రౌండ్ కౌంటింగ్
మొదటి రౌండ్‌లో ఆలపాటి రాజాకు పోలైన 17, 246 ఓట్లు, కె.ఎస్.లక్ష్మణరావుకు 7,156 ఓట్లు
గుంటూరు- కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆలపాటి రాజా ముందంజ
మొదటి రౌండ్‌లో మెుత్తం 28 వేల ఓట్ల లెక్కింపు పూర్తి
మొదటి రౌండ్ తర్వాత కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు 10,090 ఓట్ల ఆధిక్యం
మొదటి రౌండ్‌లో 2 వేలకు పైగా చెల్లని ఓట్లు పోలు
-
2025-03-03T16:38:31+05:30
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ అప్డేట్స్..
విశాఖ: ఏయూ ఈఈఈ బ్లాక్‌లో కొనసాగుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్
మొదట ప్రాధాన్యత కౌంటింగ్‌లో ఓట్లు సాధించిన అభ్యర్థుల వివరాలు
పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసుల నాయుడుకి పోలైన 7,210 ఓట్లు
ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు పోలైన 6,845 ఓట్లు
యూటీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయ గౌరీకి 5804 ఓట్లు
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లిన ఓట్లు 20,135, చెల్లని ఓట్లు 659
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 10,068
ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్‌లో కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక్రియ
-
2025-03-03T16:18:33+05:30
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై విచారణ..
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభం
టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలంటూ పిటిషన్
హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్
ఘటన జరిగి 10 రోజులైనా కార్మికుల ఆచూకీ లేదన్న పిటిషనర్ తరఫు న్యాయవాది
ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి
టన్నెల్ సహాయక చర్యల్లో ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్, ఎన్డీఆర్‌ఎఫ్ పాల్గొన్నాయన్న ఏజీ
ప్రతిరోజూ 24 గంటలపాటు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపిన ఏజీ
సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని ధర్మాసనానికి చెప్పిన సుదర్శన్ రెడ్డి
ఏజీ వివరాలను నమోదు చేసి ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ ముగించిన హైకోర్టు
-
2025-03-03T15:06:48+05:30
రసవత్తరంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
విశాఖ: రసవత్తరంగా సాగుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తేలని ఫలితం
ఏపీటీఎఫ్, పీఆర్టీయూ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ
ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ, పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు మధ్య ప్రధాన పోటీ
ఎలిమినేషన్ రౌండ్‌కు ఓట్ల లెక్కింపు
ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కంపు ద్వారా ఫలితం తేలే అవకాశం
టీచర్స్ ఎమ్మెల్సీ బ్యాలెట్లలో చెల్లని ఓట్లు నమోదు
టేబుల్‌కి సగటున 20 వరకూ పోలైన చెల్లని ఓట్లు
ప్రాధాన్యతాపరంగా అంకెలతో ఓటు వేయాల్సిన చోట టిక్ మార్కులు, ఇతర గుర్తులు పెట్టిన టీచర్ ఓటర్లు
-
2025-03-03T14:31:26+05:30
రోహిత్‌పై బాడీ షేమింగ్ కామెంట్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి ఓ కాంగ్రెస్ మహిళా నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంత లావుగా ఉన్నాడు.. అతడేం కెప్టెన్ అంటూ హిట్‌మ్యాన్‌పై బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అధికారిక ప్రతినిధి షామా మొహమ్మద్.
రోహిత్ శరీరాకృతిని విమర్శిస్తూ షామా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంట్రవర్సీకి తెరలేపాయి.
షామా వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టడంతో కాంగ్రెస్ చిక్కుల్లో పడినట్టైంది.
షామా కామెంట్స్‌తో తమకు సంబంధం లేదని హస్తం పార్టీ స్పష్టం చేసింది.
ఆ పోస్టును డిలీట్ చేయాలని మహిళా నేతను ఆదేశించింది.
-
2025-03-03T13:36:32+05:30
బొత్సకు అచ్చెన్న కౌంటర్
శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయం ఇవాళ హాట్ హాట్‌గా సాగింది.
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య వాడివేడిగా చర్చ జరిగింది.
వైసీపీ సర్కారులో చేపట్టిన పలు పథకాలపై ఇద్దరు నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను వైసీపీ నాశనం చేసిందంటూ ఫైర్ అయ్యాడు అచ్చెన్న.
కేంద్ర ప్రభుత్వం నుంచి తమ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు తీసుకువచ్చామని తెలిపారు.
-
2025-03-03T13:29:21+05:30
ఏపీలో 5 ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ దాఖలకు అవకాశముంటుంది.
11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.
ఈ నెల 20న పోలింగ్ జరగనుండగా.. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు.
జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబు, యనమల రామకృష్ణుడుల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. దీంతో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సాధారణ పరిపాలనా శాఖ సీఈఓ వివేక్ యాదవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
-
2025-03-03T12:50:53+05:30
కాకినాడలో పెను ప్రమాదం
కాకినాడ నగరంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది.
వార్పు రోడ్డులో బాలాజీ ట్రాన్స్‌పోర్టు షాపులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
హైదారాబాద్ నుంచి వచ్చిన ఓ పార్శిల్‌ను దించుతుండగా ఒక్కసారిగా పేలింది.
ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న కూలీల్లో ఐదుగురికి గాయాలవగగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పార్శిల్‌లో ఏముందనే దానిపై విచారణ చేస్తున్నారు.
-
2025-03-03T12:48:18+05:30
మెగా డీఎస్సీపై సర్కారు కీలక నిర్ణయం
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారా లోకేష్ బడ్జెట్ పద్దులపై చర్చించారు.
మెగా డీఎస్సీతో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటిస్తామని అన్నారు.
ఏపీ వ్యాప్తంగా స్కూళ్ల ప్రహరీ గోడను పూర్తి చేయాలంటే రూ.3వేల కోట్లు అవుతుందని లోకేష్ తెలిపారు.
మనబడి మనభవిష్యత్తు, ఉపాధి హమీ కింద దశలవారీ చేపడుతామని మంత్రి తెలిపారు.
డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ ఈ ప్రభుత్వం చేపట్టిందని లోకేష్ గుర్తుచేశారు.
-
2025-03-03T12:10:54+05:30
గుంటూరు-కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేగంగా జరుగుతోంది.
గుంటూరు-కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం..
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 371.
చెల్లకుండాపోయిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 51.
-
2025-03-03T11:55:06+05:30
మళ్లీ వస్తా
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికాతో సత్సంబంధాలను కాపాడుకోగలనని, ఖనిజాల ఒప్పందంలో గత వారం ఏకాభిప్రాయం కుదరలేదన్నారు జెలెన్‌స్కీ.
నిర్మాణాత్మక చర్చ కోసం ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తానని, సమస్యలు పరిష్కరించుకోవడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు.
-
2025-03-03T11:55:05+05:30
పోసాని కేసులో మరో ట్విస్ట్
సినీనటుడు పోసాని కృష్ణమురళిపై నరసారావుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
153 ఏ 67 ఇట్ యాక్ట్ 504 సెక్షన్‌ల కింద ఆయనపై కేసు ఫైల్ అయింది.
పోసాని కేసు నేపథ్యంలో పీటీ వారెంట్‌తో రాజంపేట సబ్ జైలుకు చేరుకున్నారు నరసరావుపేట పోలీసులు.
రాజంపేట సబ్‌జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత పోసానిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
రాజంపేట సబ్ జైల్లో నాలుగు రోజులుగా పోసాని రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
నరసారావుపేట టూ టౌన్ సీఐ హేమారావు ఆధ్వర్యంలో నరసరావుపేటకు పోసానిని తరలించారు.
-
2025-03-03T11:55:04+05:30
ఆస్కార్ విజేతలు వీళ్లే..
ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాల వేడుక ఘనంగా ఆరంభమైంది.
లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 97వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోంది.
ప్రముఖ నటుడు, నిర్మాత కానన్ ఓ బ్రియాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈసారి అవార్డులు గెలుచుకున్నది వీళ్లే..
ఉత్తమ నటుడు: అడ్రియన్ బ్రాడీ (ద్రి బ్రూటలిస్ట్)
ఉత్తమ దర్శకుడు: సీన్ బేకర్ (అనోరా)
ఉత్తమ సహాయ నటుడు: కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్)
ఉత్తమ సహాయ నటి: జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: అనోరా (సీన్ బేకర్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: డ్యూన్: పార్ట్2
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ఫ్లో
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్: ఇన్ ది షాడో ఆఫ్ సైప్రెస్
-
2025-03-03T11:55:03+05:30
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదవ్వలేదు.
కౌంటింగ్‌లో భాగంగా తొలుత బ్యాలెట్ ఓట్లను కట్టలు కడుతున్నారు సిబ్బంది.
ఏజెంట్ల సమక్షంలో 25 ఓట్ల చొప్పున ఒక బ్యాండిల్‌ను కట్టలుగా కడుతున్నారు.
5 వేల బ్యాండిల్స్ అయ్యాక ఓట్ల అధికారులు కౌంటింగ్ షురూ చేయనున్నారు.
అభ్యర్థులతో పాటు ఏజెంట్ల సమక్షంలో ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌ను ఓపెన్ చేశారు.
ఓట్ల లెక్కింపులో భాగంగా ఓట్ల జంబ్లింగ్ పూర్తి చేశారు.
వ్యాలిడ్, ఇన్‌వ్యాలిడ్ ఓట్లను వేరు చేస్తున్నారు కౌంటింగ్ సిబ్బంది.