-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy Breaking latest viral and trending news across GLOBE 3rd oct 2025 kjr
-
BREAKING: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం
ABN , First Publish Date - Oct 03 , 2025 | 06:24 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 03, 2025 17:44 IST
వచ్చే ఏడాది ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఏపీ ఇంటర్ తొలిఏడాది పరీక్షలు
ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు ఏపీ ఇంటర్ రెండోఏడాది పరీక్షలు
జనవరి 21న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష
జనవరి 23న పర్యావరణ పరిరక్షణ పరీక్ష
ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ప్రాక్టికల్ పరీక్షలు
జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఒకేషనల్ కోర్సులకు ప్రాక్టికల్స్
ఫిబ్రవరి 13న సమగ్ర శిక్షా ఒకేషనల్ ట్రేడ్ పరీక్ష
-
Oct 03, 2025 17:44 IST
విజయనగరం: డీసీసీబీకి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స లేఖ
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు డీసీసీబీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన..
ప్రత్యేక వేదికలో తమకు కుర్చీలు కేటాయించాలని బొత్స లేఖ
కూటమి ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స ఎలా డీసీసీబీని..
వినియోగించుకుంటారని చైర్మన్ కిమిడి నాగార్జున విమర్శ
బొత్స ప్రతిపాదనను అంగీకరించబోమని స్పష్టంచేసిన చైర్మన్ నాగార్జున
-
Oct 03, 2025 17:44 IST
వృద్ధాప్య పెన్షనర్ల ఆందోళన..
పల్నాడు: క్రోసూరు మండలం దొడ్లేరులో వృద్ధాప్య పెన్షనర్ల ఆందోళన
వేలిముద్రలు తీసుకుని పెన్షన్ డబ్బు ఇవ్వలేదంటూ..
సచివాలయ ఉద్యోగి మనోజ్‌ను గదిలో నిర్బంధించిన గ్రామస్థులు
యూరియా ఇప్పిస్తానని ఉద్యోగి మనోజ్ డబ్బు సేకరించినట్లు ఆరోపణలు
-
Oct 03, 2025 17:44 IST
అమరావతి: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం
ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్‌కు కేబినెట్ ఆమోదం
జలవనరులశాఖ పనులకు ఏపీ కేబినెట్ ఆమోదం
ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేలు చొప్పున ఇచ్చేందుకు ఆమోదం
కారవాన్ పర్యాటకానికి ఏపీ కేబినెట్ ఆమోదం
అమృత్ పథకం 2.O పనులకు ఏపీ కేబినెట్ ఆమోదం
-
Oct 03, 2025 17:26 IST
అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు సమీక్ష
వచ్చే పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలి: చంద్రబాబు
2026 జనవరి నాటికి ఎడమకాల్వ పనులు పూర్తి చేయాలి: చంద్రబాబు
వచ్చే నవంబర్ నుంచి ప్రధాన డ్యామ్ పనులు ప్రారంభించాలి: సీఎం చంద్రబాబు
-
Oct 03, 2025 16:49 IST
ఆటముగిసే సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే..
అహ్మదాబాద్ టెస్టు: రెండోరోజు ఆటముగిసే సమయానికి భారత్ 448/5
వెస్టిండీస్‌పై 286 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 162 ఆలౌట్
భారత్ బ్యాటింగ్: ధృవ్ జురెల్ 125, జడేజా 104, రాహుల్ 100 పరుగులు
శుభ్‌మన్ గిల్ 50, యశస్వి జైస్వాల్ 36 పరుగులు
-
Oct 03, 2025 16:38 IST
అహ్మదాబాద్ టెస్టు: రవీంద్ర జడేజా సెంచరీ
టెస్టు కెరీర్‌లో 6వ సెంచరీ చేసిన రవీంద్ర జడేజా
168 బంతుల్లో సెంచరీ చేసిన రవీంద్ర జడేజా
-
Oct 03, 2025 16:13 IST
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
224 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
58 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
-
Oct 03, 2025 16:13 IST
శ్రీకాకుళం, మన్యం, విజయనగరం కలెక్టర్లతో హోంమంత్రి అనిత రివ్యూ
భారీ వర్షాల నేపథ్యంలో వరద పరిస్థితిపై హోంమంత్రి అనిత ఆరా
జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ నిరంతరం అలర్ట్‌గా ఉండాలి: హోంమంత్రి అనిత
ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలి: హోంమంత్రి అనిత
వంశధార, నాగావళి నదులు పరివాహక ప్రాంత ప్రజలను అలర్ట్ చేయాలి
అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ 112, 1070, 1800 425 0101 ఏర్పాటు
-
Oct 03, 2025 16:13 IST
జురెల్ సెంచరీ..
అహ్మదాబాద్ టెస్టు: ధృవ్ జురెల్ సెంచరీ
టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ చేసిన జురెల్
-
Oct 03, 2025 16:13 IST
ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు
త్వరలో ఆపరేషన్ సిందూర్ 2.O: ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
పాకిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలి: ఆర్మీ చీఫ్ ద్వివేది
లేదంటే పాకిస్థాన్‌ను ప్రపంచం పటం మీద లేకుండా చేస్తాం: ఆర్మీ చీఫ్ ద్వివేది
సైన్యం సిద్ధంగా ఉండాలి: ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
-
Oct 03, 2025 16:13 IST
కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ విచారణ
సిట్ దర్యాప్తునకు మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఆదేశం
తొక్కిసలాట తర్వాత TVK నేతలు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించిన హైకోర్టు
ఘటనాస్థలిలో బాధితులను ఎందుకు పట్టించుకోలేదని హైకోర్టు ప్రశ్న
విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నించిన హైకోర్టు
TVK నేతల ముందస్తు బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్
-
Oct 03, 2025 14:00 IST
తిరుపతికి ఉగ్రవాదుల బాంబు బెదిరింపులు
ఉగ్రవాదుల బెదిరింపులతో అప్రమత్తమైన పోలీసులు
పలు ప్రాంతాల్లో బాంబు డిస్పోజల్ బృందాల తనిఖీలు
రెండు అనుమానాస్పద మెయిల్స్‌తో పోలీసులు తనిఖీలు
తమిళనాడు కేంద్రంగా ISI, మాజీ LTTE మిలిటెంట్లు..
కుట్ర పన్నినట్లు మెయిల్ బెదిరింపులు
తిరుపతిలో 4 ప్రాంతాల్లో RDX పేలుడు పదార్థాలను పేల్చబోతున్నట్లు బెదిరింపు
తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిలతీర్థం, గోవిందరాజుల స్వామి ఆలయం ప్రాంతాల్లో తనిఖీలు
జడ్జిల నివాస సముదాయం, కోర్టు ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు
ఈ నెల 6న సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన నేపథ్యంలో వ్యవసాయ కళాశాల హెలిప్యాడ్ వద్ద తనిఖీలు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుమల, శ్రీకాళహస్తి దేవస్థానాల్లోనూ బీడీ టీమ్స్ సోదాలు
-
Oct 03, 2025 13:43 IST
రేపు బీహార్‌లో ఎన్నికల సంఘం అధికారుల పర్యటన
రేపు, ఎల్లుండి బీహార్‌లో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు
అక్టోబర్ 6 లేదా 7న బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ ?
2025 నవంబర్ 22 నాటికి ముగియనున్న ప్రస్తుత అసెంబ్లీ కాలం
కొత్త అసెంబ్లీ ..ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే మరో 52 రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయం
బీహార్ మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు
-
Oct 03, 2025 12:59 IST
మహారాష్ట్ర థానే కోర్టు సంచలన తీర్పు
చిరిగిన రికార్డులతో 32 ఏళ్ల నాటి కేసులో నిర్దోషులుగా తేలిన ఐదుగురు
1992లో ఓ వ్యక్తి హత్య కేసులో ఐదుగురు వ్యక్తులు అరెస్ట్
గతంలో విచారణలో జాప్యంతో నిందితులకు బెయిల్
నిందితుల ఆచూకీ తెలియకపోవడంతో కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ
-
Oct 03, 2025 11:30 IST
నేడు హైదరాబాద్‌లో రాజనాథ్ సింగ్ పర్యటన
శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించనున్న కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్
హైటెక్స్ లో జరగనున్న JITO CONNECT కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర రక్షణ మంత్రి
ఉదయం 11.30కు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న రాజ్నాథ్ సింగ్
12 గంటలకు "JITO CONNECT " ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్న రక్షణ మంత్రి
2.45pm బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి తిరిగివెళ్లనున్న రాజ్ నాథ్ సింగ్
-
Oct 03, 2025 10:36 IST
అమరావతిలో మలేసియా బృందం..
రాజధాని అమరావతిలో పర్యటిస్తున్న మలేసియా బృందంతో CRDA కమిషనర్ కె.కన్నబాబు భేటీ
ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పురోగతి తదితర అంశాలను మలేసియా బృందంతో చర్చించిన కమిషనర్
నిర్మాణం పూర్తి చేసుకున్న AIS అధికారుల భవన సముదాయాల పరిశీలన
మలేసియా బృందానికి అమరావతిలో రెసిడెన్షియల్ భవనాల పురోగతిని వివరించిన CRDA కమిషనర్ కె.కన్నబాబు
-
Oct 03, 2025 10:06 IST
ఆ గ్రామాలకు ప్రమాద హెచ్చరిక
శ్రీకాకుళం వంశధార నది పరీవాహక ప్రాంతంలో దిగువున ఉన్న గ్రామాలకు రెండో ప్రమాద హెచ్చరిక
వంశధార నదికి 83,258 క్యూసెక్కుల నీరు వస్తుంది.
లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
-
Oct 03, 2025 08:31 IST
మత్తు పదార్థాల పట్టివేత
జహీరాబాద్ చెక్ పోస్ట్ వద్ద భారీగా మత్తు పదార్థాలు పట్టివేత
50 లక్షల రూపాయలు విలువైన నైట్రో జెఫమ్ ని పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు
ట్రావెల్స్ బస్సులో గోవా నుంచి హైదరాబాద్‌కి తరలిస్తున్న నిందితులు.
-
Oct 03, 2025 06:30 IST
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ..
అమరావతిలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానున్న మంత్రిమండలి..
ప్రధాని ఏపీ టూర్‌పై చర్చించనున్న కేబినెట్
ఈ నెల 16 న ఏపీ కి ప్రధాని మోడీ..
జీఎస్టీ కి సంబంధించి ఎన్డీయే వరస కార్యక్రమాలు
ఏపీలో జీఎస్టీ కార్యక్రమాలకు సంబంధించి మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం...
రాజధాని నిర్మాణం, కొన్ని సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కేబినెట్‌లో చర్చ..
కాబినెట్ తర్వాత తాజా రాజకీయ పరిణామాలు మంత్రుల తో చర్చించనున్న సీఎం చంద్రబాబు..