Share News

Papaya Side Effects: ఈ 5 మంది ఎట్టి పరిస్థితుల్లో బొప్పాయి తినకూడదు.. చాలా డేంజర్..!

ABN , Publish Date - Aug 04 , 2025 | 08:24 PM

Papaya Disadvantages: బొప్పాయి పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులోని పోషకాల వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు జరుగుతుంది. జీర్ణక్రియ నుంచి చర్మం వరకు అనేక సమస్యలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది. అందుకే ప్రజలు బొప్పాయిని తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. కానీ, ఈ వ్యక్తులకు మాత్రం బొప్పాయి చాలా హానికరం.

Papaya Side Effects: ఈ 5 మంది ఎట్టి పరిస్థితుల్లో బొప్పాయి తినకూడదు.. చాలా డేంజర్..!
Papaya Side Effects

బొప్పాయి గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి అనేక ప్రమాదకరమైన వ్యాధుల నుండి రక్షిస్తుంది. అందుకే చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని క్రమం తప్పకుండా తింటూ ఉంటారు. బొప్పాయిలో ఆహార ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ప్రయోజనాలతో పాటు తీపి రుచి కారణంగా ప్రజలు దీనిని తినడానికి ఇష్టపడతారు. పండిన బొప్పాయి మాత్రమే కాదు. పచ్చి బొప్పాయి కూడా తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. చాలా మంది పచ్చి బొప్పాయితో వంటకాలు కూడా తయారు చేస్తారు. కానీ, ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ అందరూ బొప్పాయి తినకూడదు. ఏఏ వ్యక్తులు బొప్పాయికి దూరంగా ఉండాలి.. ఎందుకు అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.


గర్భిణీ స్త్రీలు

గర్భధారణ సమయంలో పోషకాహారం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా బొప్పాయిని అస్సలు తినకూడదు. పచ్చిగా లేదా సగం పండిన బొప్పాయి తినడం వల్ల గర్భధారణ సమయంలో గర్భాశయంలో సంకోచాలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఇందులో పపైన్ ఉంటుంది. ఇవి సమయానికి ముందే ప్రసవానికి కారణమవుతాయి. కొన్నిసార్లు గర్భస్రావానికి దారితీయవచ్చు.ఇదే కాకుండా గర్భధారణకు ముందు ఏదైనా సమస్య ఉన్నా బొప్పాయి తినవద్దు.

లాటెక్స్ అలెర్జీ

చాలా మందికి లేటెక్స్ అలెర్జీ ఉంటుంది. అలాంటి వారు బొప్పాయికి దూరంగా ఉండాలి. బొప్పాయిలో లేటెక్స్ ఉంటుంది. దీని కారణంగా వారికి అలెర్జీ కలుగవచ్చు. దద్దుర్లు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది , శరీరంలో వాపు వంటి సమస్యలు వస్తాయి .


కిడ్నీలో రాళ్ళు

బొప్పాయిలో విటమిన్ సి అధికం. కాబట్టి, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. బొప్పాయి తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల పరిమాణం పెరుగుతుంది. పరిస్థితి మరింత దిగజారుతుంది. దీనికి కారణం విటమిన్ సి. కాల్షియం ఆక్సలేట్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుంది. కాబట్టి, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న రోగులు బొప్పాయి తినకూడదు.

గుండె రోగులు

బొప్పాయిలో గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక అంశాలు ఉన్నాయి. కానీ మీకు ఏదైనా గుండె జబ్బులు ఉంటే, బొప్పాయి తినడం మానుకోండి. నిజానికి బొప్పాయిలో హృదయ స్పందనలు సక్రమంగా ఉండకుండా చేసే కొన్ని పదార్థాలు ఉన్నాయి. కాబట్టి, గుండె రోగులు బొప్పాయి తినకూడదు.


హైపోగ్లైసీమియా రోగులు

బొప్పాయి మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. కానీ ఇప్పటికే చక్కెర స్థాయి తక్కువగా ఉన్నవారు లేదా హైపోగ్లైసీమియాతో బాధపడుతున్నవారు వైద్యుడిని సంప్రదించకుండా బొప్పాయిని తినకూడదు. ఇది గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కాదు.. ఈ వ్యాధులకు దివ్యౌషధం..!

వర్షాకాలంలో ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఏ వ్యాధి మీ దగ్గరకు రాదు.!

For More Health News

Updated Date - Aug 04 , 2025 | 08:27 PM