Minister Uttham Kumar Reddy: తప్పు మొత్తం కేసీఆర్ దే.. :మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Aug 04 , 2025 | 07:11 PM
మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కూలిపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అధిక వడ్డీలతో రూ.84వేల కోట్లు అప్పు తెచ్చిందని తెలిపారు. రుణాలు తెచ్చే విషయంలో అప్పటి బీఆర్ఎస్ నాయకులు అవకతవకలకు పాల్పడ్డారని విమర్శించారు.

హైదారబాద్: మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కూలిపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. ఆయన ఇవాళ (సోమవారం) మీడియాతో మాట్లాడారు.. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అధిక వడ్డీలతో రూ.84వేల కోట్లు అప్పు తెచ్చిందని తెలిపారు. రుణాలు తెచ్చే విషయంలో అప్పటి బీఆర్ఎస్ నాయకులు అవకతవకలకు పాల్పడ్డారని విమర్శించారు.
డిజైన్ మార్చారు..
తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టాలని గతంలో నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్(Minister Uttam Kumar) గుర్తు చేశారు. రూ.38వేల కోట్లతో తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ చేపట్టాల్సి ఉందన్నారు. కానీ బీఆర్ఎస్(BRS) అధికారంలోకి వచ్చి స్థలాన్ని మార్చిందన్నారు. 16 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా డిజైన్ చేశారని పేర్కొన్నారు. కానీ కేసీఆర్(KCR) సీఎం అయ్యాక ఇష్టానుసారం డిజైన్లు మార్చేశారని మండిపడ్డారు. మేడిగడ్డ డిజైన్, నిర్మాణం అన్నీ కేసీఆరే చేశారని స్పష్టం చేశారు. అప్పుడు సీఎం, నీటిపారుదల మంత్రి రెండు ఆయనే అని తెలిపారు. 2016లో కాళేశ్వరం అగ్రిమెంట్ జరిగిందని, 2019లో పనులు ప్రారంభమయ్యాయని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పుకొచ్చారు. 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ కుంగిపోయిందన్నారు.
విచారణలో ఏం ఉంది..
రాజకీయాల అంశాలతో సంబంధం లేకుండా పీసీ ఘోష్ కమిషన్ వేశామని మంత్రి ఉత్తమ్ కుమార్(Minister Uttam Kumar) తెలిపారు. కమిషన్ 605 పేజీలతో కూడిన రిపోర్ట్‌ను ప్రభుత్వానికి ఇచ్చిందని చెప్పారు. రిపోర్ట్ అధ్యయనానికి ముగ్గురు అధికారులతో కమిటీ వేసినట్లు పేర్కొన్నారు. నివేదికను 25 పేజీలకు కుదించి కమిటీ క్లుప్తంగా అందించిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో అనేక లోపాలున్నాయని NDSA కూడా చెప్పిందని స్పష్టం చేశారు. డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలున్నాయని స్పష్టం చేసిందని అన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్‌లో చర్చించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అరెస్ట్ చేయొచ్చు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
వారిపై చర్యలకు కాళేశ్వరం కమిషన్ కీలక సిఫార్స్
Read latest Telangana News And Telugu News