Garlic Peel Benefits: వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కాదు.. ఈ వ్యాధులకు దివ్యౌషధం..!
ABN , Publish Date - Aug 04 , 2025 | 08:00 PM
వెల్లుల్లి తొక్కలు పనికిరానివి అని భావించి పారవేయకండి. మనం తరచుగా పారవేసే వెల్లుల్లి తొక్కలను అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

వెల్లుల్లిని పురాతన కాలం నుండి ఆహార రుచిని పెంచడానికి, ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు. వెజ్, నాన్ వెజ్ అని తేడా లేకుండా ప్రతి వంటకంలో తప్పనిసరిగా వాడుతుంటారు. కానీ మీరు వెల్లుల్లి తొక్కలను పనికిరానివిగా భావించి పారేస్తుంటే అది చాలా పొరపాటు. ఆయుర్వేదం ప్రకారం, వెల్లుల్లి రెబ్బల్లాగే వెల్లుల్లి తొక్కల్లో కూడా రోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలను కలిగి ఉందని చాలా మందికి తెలియదు. అవి తెలిస్తే ఇంకెప్పుడూ పారవేయరని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కాబట్టి, వెల్లుల్లి తొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? దానిని ఎలా ఉపయోగించాలి? ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ఆస్తమా
ఆస్తమా రోగులు వెల్లుల్లి తొక్కలను తీసుకుంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తగ్గి ఉపశమనం లభిస్తుంది . దీని కోసం వారు వెల్లుల్లి తొక్కలను మెత్తగా రుబ్బి ఉదయం, సాయంత్రం తేనెతో కలిపి తినాలి.
చర్మ సమస్యలు
దురద, తామర వంటి చర్మ సమస్యలు ఉన్నవారికి వెల్లుల్లి తొక్క చాలా ప్రయోజనకరంగా ఉంటుంది . ఇందుకోసం ముందుగా వెల్లుల్లి తొక్కలను కొన్ని గంటలు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత దీన్ని ప్రభావిత శరీర భాగాలపై పూసి కాసేపయ్యాక నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉన్న యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మంపై దురద, చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
గాయాలకు దివ్య ఔషధం
వెల్లుల్లి తొక్కలు గాయాలను నయం చేయడంలో చాలా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. దీని కోసం వెల్లుల్లి తొక్కలను కాల్చి వాటి బూడిదను తేనెతో కలిపి గాయంపై పూస్తే చాలు. గాయం త్వరగా నయమవుతుందని అంటారు.
జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది
వెల్లుల్లి తొక్కలలో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివని చెబుతారు. ముందుగా వెల్లుల్లి తొక్కలను పొడిగా చేసి నూనెతో కలిపి జుట్టుకు రాయండి. కొద్దిసేపు అలాగే ఉంచి జుట్టును శుభ్రపరచుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాకుండా పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. వెల్లుల్లి తొక్కలలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
జీర్ణ సమస్యలకు ఔషధం
వెల్లుల్లి తొక్కలు యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల వెల్లుల్లి తొక్కలతో టీ తయారు చేసి తాగితే, గొంతు సమస్యలు, జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్లు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే, ఈ టీ జీర్ణ సమస్యలను తగ్గించడంలో చాలా సహాయకారిగా ఉంటుందని చెబుతారు.
వెల్లుల్లి తొక్కల టీ తయారు చేసే విధానం: వెల్లుల్లి తొక్కలను నీటిలో మరిగించి వడకట్టండి. మీకు కావాలంటే రుచి కోసం కొద్దిగా తేనె కూడా జోడించవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
శరీరాన్ని ఫిట్‌గా ఉంచే ఆరోగ్య చిట్కాలు ఇవే.!
ఐఎండీ అలర్ట్.. ఆగస్టు 9 వరకు ఈ రాష్టాల్లో భారీ వర్షాలు
For More Health News