Share News

Kaleshwaram Project Commission Report: కాళేశ్వరం నివేదికపై ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం

ABN , Publish Date - Aug 04 , 2025 | 07:15 PM

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రభుత్వానికి అందిన నివేదికలో అన్ని వేళ్లు బీఆర్ఎస్ పార్టీ అధినే, మాజీ సీఎం కేసీఆర్‌ వైపే చూపిస్తున్నాయి. అలాంటి వేళ.. ఆ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.

Kaleshwaram Project Commission Report: కాళేశ్వరం నివేదికపై ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం
BRS Chief KCR

హైదరాబాద్, ఆగస్ట్ 04: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రభుత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ అందించిన నివేదికతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఈ నివేదికపై ముగ్గుర ఉన్నతాధికారులతో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సైతం తన నివేదికను సోమవారం జరిగిన కేబినెట్ ముందు ఉంచింది. దీంతో రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది.

అయితే ఈ రెండు నివేదికల్లో బీఆర్ఎస్ పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ పేరు పేరు అత్యధిక సార్లు పేర్కొన్నారు. అంతేకాకుండా.. లక్షల కోట్ల రూపాయిలతో ఈ ప్రాజెక్ట్ నిర్మించి ప్రజాధనాన్ని వృథా చేశారంటూ ఇప్పటికే అధికార, విపక్ష పార్టీ బీజేపీ నేతలు.. బీఆర్ఎస్‌పై నిప్పలు చెరుగుతున్నారు.


అలాంటి వేళ.. బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా రేపు.. అంటే మంగళవారం తెలంగాణ భవన్‌లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రేపు మధ్యాహ్నం 12.00 గంటలకు ఆయన ఈ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక ఈ ప్రెజెంటేషన్‌ను అన్ని నియోజకవర్గాల్లో.. బహిరంగంగా ప్రదర్శించాలని పార్టీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.


మరోవైపు ఈ ప్రాజెక్ట్‌కు కర్త, కర్మ, క్రియ అంతా కేసీఆరే అంటూ ఇప్పటికే ఓ ప్రచారం సాగుతోంది. అలాంటి వేళ.. కమిషన్ ఇచ్చిన నివేదికపై హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇంకోవైపు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. 650 పేజీలతో ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తే.. దీనిపై ఏర్పాటైన కమిషన్ 60 పేజీలకు అందులోని సారాన్ని కుదించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్‌ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 04 , 2025 | 08:06 PM