UNSC Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఐక్యరాజ్యసమితి..
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:31 AM
UNSC Condemns Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ దారుణ మారణకాండకు ప్రేరేపించిన వారిని, చేసినవారిని చట్టం ముందుకు తీసుకురావాలని పిలుపునిచ్చింది.

UNSC Condemns Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రవాద దాడుల్లో 26 మంది పర్యాటకులను అమానవీయంగా కాల్చి చంపిన ఉగ్రవాదులను, వారికి సహకరించిన వారిని చట్టం ముందు నిలబెట్టాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) పిలుపునిచ్చింది. ఏప్రిల్ 22న బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు 15 దేశాల కౌన్సిల్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
న్యూయార్క్‌లో జరిగిన 15 దేశాల కౌన్సిల్ సమావేశంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించింది. భద్రతా మండలి సభ్యులు బాధితుల కుటుంబాలకు, భారతదేశం, నేపాల్ ప్రభుత్వాలకు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదం అంతర్జాతీయ శాంతిభద్రతలకు అత్యంత తీవ్రమైన ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నేరపూరితం, అన్యాయమైన ఈ దారుణ చర్యలను UNSC ఖండిస్తుందని పునరుద్ఘాటించారు.
కౌన్సిల్ ప్రెసిడెంట్, UNలో ఫ్రాన్స్ శాశ్వత ప్రతినిధి, రాయబారి జెరోమ్ బోనాఫాంట్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం "ఈ దారుణ ఉగ్రవాద చర్యకు ఉసిగొల్పిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టాల్సిన అవసరముందని భద్రతా మండలి సభ్యులు నొక్కి చెప్పారు. దాడిలో పాల్గొన్నవారు, ప్రేరేపించినవారు, ఆర్థికంగా సహకరించిన వారంతా ఈ హత్యలకు జవాబుదారీగా ఉండాల్సిందేనని ప్రకటించారు. ఈ విషయంలో నిందితులకు శిక్ష పడేలా అన్ని దేశాలు చురుగ్గా పనిచేయాలని కోరారు."
ప్రస్తుతం భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నిరంతరం గమనిస్తూనే ఉన్నామని ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ వెల్లడించారు. "రెండు అణ్వస్త్ర దేశాలు" యుద్ధానికి దిగవచ్చనే వ్యాఖ్యను తిరస్కరించారు.
Read Also: Pahalgam Terror Attack: అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం
Medha Patkar: పరువు నష్టం కేసులో మేధా పాట్కర్ అరెస్టు, విడుదల
Delhi Special Court: సోనియా, రాహుల్‌కు నోటీసుల జారీకి నో