Trump Golf: ట్రంప్ గోల్ఫ్ వీడియో చూసి నెటిజన్లు షాక్.. స్కాట్లాండ్ వీడియో హల్‌చల్!
ABN , Publish Date - Jul 28 , 2025 | 02:26 PM
స్కాట్లాండ్ గోల్ఫ్ మైదానంలో క్రీడాస్ఫూర్తిని అమెరికా డొనాల్డ్ చేసిన పని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. 'ట్రంప్ అత్యంత మోసగాడు' అని క్రీడా రచయిత రిక్ రిల్లీ చేసిన వాదనకు తాజా వివాదం మరింత బలం చేకూరుస్తోంది.

ఎడిన్‌బరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు స్కాట్లాండ్ వెళ్లారు. స్వతహాగా గోల్ఫ్ ప్రియుడైన ట్రంప్ టర్న్‌బెర్రీ గోల్ఫ్ కోర్సులో గోల్ఫ్ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంత పెద్ద మనిషి ఇలాంటి పని చేశాడేంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. గోల్ఫ్ కోర్టులో ట్రంప్ చేసిన పని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఆఖరికి ఎంతో ఇష్టమని చెప్పుకునే ఆటలోనూ చీటింగ్ అవసరమా.. అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికే వరస ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్ ఈ సారి గోల్ఫ్ వివాదంలో చిక్కుకున్నాడు.
ట్రంప్ శనివారం స్కాట్లాండ్ పర్యటనకు వెళ్లాడు. ఈ సందర్భంగా రికార్డ్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ట్రంప్ కార్ట్‌లో బంకర్ వద్దకు వెళతాడు. అయితే, ఎర్రటి చొక్కా ధరించిన క్యాడీలు ఇద్దరు ట్రంప్ కంటే ముందు నడుస్తూ వెళతారు. వాళ్లలో రెండవ వ్యక్తి శాండ్ ట్రాప్ కు కొద్ది దూరంలో పడిన బాల్ విసిరేస్తున్నట్లు కనిపిస్తుంది. ట్రంప్ గోల్ఫ్ కార్ట్ నుంచి బయటకు దిగక ముందే ఈ తంతు నడుస్తుంది.
ఈ క్లిప్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. కొందరు ట్రంప్ మోసం చేశాడని ఆరోపించగా.. మరికొందరు వాణిజ్య చర్చల మధ్య ఆయన గోల్ఫ్‌పై దృష్టి పెట్టలేకపోయారేమో అని ఛలోక్తులు విసురుతున్నారు. మొదట, అతడు తన భార్యను, పిల్లలను మోసం చేశాడు. ఇప్పుడు గోల్ఫ్‌లో మోసం చేస్తున్నాడు. ఇదేం దిగజారుడుతనం? అని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు.
ఇవి కూడా చదవండి
జపాన్ వేడుకల్లో తైపీ జెండాల తొలగింపు.. చైనా చర్యపై తైవాన్ ఆగ్రహం
యూరోపియన్ యూనియన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం.. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి