Share News

IB Security Assistant Recruitment 2025: టెన్త్ పాసైనవారికి గోల్డెన్ ఛాన్స్.. IBలో 4900లకు పైగా జాబ్స్..!

ABN , Publish Date - Jul 28 , 2025 | 02:10 PM

ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారికి ఇది గొప్ప అవకాశం. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఆరంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 17, 2025 దరఖాస్తు ఫారం సమర్పించడానికి చివరి తేదీ .

IB Security Assistant Recruitment 2025: టెన్త్ పాసైనవారికి గోల్డెన్ ఛాన్స్.. IBలో 4900లకు పైగా జాబ్స్..!
IB Security Assistant recruitment 2025

పదో తరగతి పాసైన నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్. ఇంటెలిజెన్స్ బ్యూరో 4987 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకానికి జులై 26 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 17, 2025 దరఖాస్తు ఫారం సమర్పించడానికి చివరి తేదీ. IBలో ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే అభ్యర్థులు నిర్ణీత తేదీల్లోపు ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. హోం మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ www.mha.gov.in ని ద్వారా అప్లికేషన్ సమర్పించండి.


అర్హతలు

  • అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు అభ్యర్థి తాను దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న రాష్ట్ర నివాసి అయి ఉండాలి. స్థానిక భాష పరిజ్ఞానం తప్పనిసరి.

  • కనీస వయస్సు 18 సంవత్సరాలు. గరిష్ఠ వయస్సు 27 సంవత్సరాల కంటే మించకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ఠ వయస్సులో సడలింపు ఉంటుంది. ఆగస్టు,17 2025 ను ప్రకారం వయస్సును లెక్కిస్తారు.

రుసుము

పరీక్ష ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 550. జనరల్, ఓబీసీ, EWS కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ.100లతో సహా రూ. 650 డిపాజిట్ చేయాలి. SC, ST, మహిళా అభ్యర్థులు, మాజీ సైనికులకు దరఖాస్తు రుసుములో మినహాయింపు ఉంటుంది. కాబట్టి వారు రూ. 550 మాత్రమే డిపాజిట్ చేయాలి.


Screenshot 2025-07-28 135328.jpg

ఎంపిక ప్రక్రియ?

ఈ ఉద్యోగానికి ఎంపికవ్వాలంటే అభ్యర్థులు టైర్-1, టైర్-2 పరీక్షలకు హాజరు కావాలి. రెండు పరీక్షలలో విజయం సాధించిన అభ్యర్థులను టైర్-3లో ఇంటర్వ్యూ పరీక్షకు ఆహ్వానిస్తారు. అన్ని దశల్లో అభ్యర్థి చూపిన ప్రతిభ ఆధారంగా తుది జాబితా తయారు చేస్తారు.


ఎలా దరఖాస్తు చేయాలి?

అధికారిక వెబ్‌సైట్ mha.gov.in లేదా ncs.gov.in ని సందర్శించండి.

హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న 'సెక్యూరిటీ అసిస్టెంట్ SA/ఎగ్జిక్యూటివ్ పరీక్ష 2025 పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు' లింక్‌పై క్లిక్ చేయండి.

'ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్' పై క్లిక్ చేసి అవసరమైన సమాచారాన్ని నమోదు చేయడం ద్వారా అకౌంట్ క్రియేట్ చేయండి.

ఇప్పుడు మీ ఖాతాలోకి లాగిన్ అయి వ్యక్తిగత సమాచారం, అర్హత వివరాలు, డిక్లరేషన్ ఫారమ్ నింపండి.

ఫోటో, సంతకం అవసరమైన ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయండి.

దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించి ఫారం సబ్మిట్ చేయండి. తర్వాత ప్రింటవుట్ తీసుకోండి.


దరఖాస్తు ఫారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి

సైబర్‌ సెక్యూరిటీ - సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఐఐటీ బాంబే సర్టిఫికెట్‌ ప్రొగ్రామ్‌

రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ జాబ్స్

For More Educational News And Telugu News

Updated Date - Jul 28 , 2025 | 02:21 PM