Share News

Srushti Fertility Centers: ఏపీలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లలో బయటపడుతున్న అక్రమాలు

ABN , Publish Date - Jul 28 , 2025 | 02:02 PM

విశాఖపట్నంలోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో అక్రమాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ జంట ఫిర్యాదుతో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ అక్రమాల డొంక కదిలింది. విశాఖపట్నంలో గత రెండేళ్లుగా రహస్యంగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ని ఓ డాక్టర్ నడుపుతున్నారు.

Srushti Fertility Centers: ఏపీలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లలో బయటపడుతున్న అక్రమాలు
Srushti Fertility Centers

విశాఖపట్నం: నగరంలోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో (Srushti Fertility Centers) అక్రమాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ జంట ఫిర్యాదుతో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ అక్రమాల డొంక కదిలింది. విశాఖపట్నంలో గత రెండేళ్లుగా రహస్యంగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ని ఓ డాక్టర్ నడుపుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన మహిళ విశాఖలోనే చికిత్స పొందినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విశాఖ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో మహిళలకు వైద్యం చేసినట్లు అనేక అనుమానాలు వస్తున్నాయి.


జిల్లాలో 50 ఫెర్టిలిటీ సెంటర్‌‌లలో.. కేవలం 9 కేంద్రాలకు మాత్రమే సరోగసీకి ప్రభుత్వ అనుమతి ఉంది. గత రెండేళ్లుగా విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఫెర్టిలిటీ సెంటర్‌‌‌లని పట్టించుకోలేదు. పేద ప్రజలని టార్గెట్ చేసుకొని ఫెర్టిలిటీ సెంటర్లు అక్రమ దందాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సృష్టి వ్యవహారంతో మిగిలిన ఫెర్టిలిటీ సెంటర్‌లపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తనిఖీలు చేస్తే మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.


విజయవాడలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ బోర్డులు మాయం

మరోవైపు.. విజయవాడలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ బోర్డులు మాయం చేశారు. విజయవాడ సెంటర్‌కు అనుమతులు లేవని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు  DMHO నిన్న(ఆదివారం) ప్రకటించింది. విజయవాడ సెంటర్‌కి తాళాలు వేసి వాహనాలతో సహా, బోర్డులు తొలగించి అంబులెన్స్‌తో సహా ఫెర్టిలిటీ సెంటర్ సిబ్బంది పరారయ్యారు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై వచ్చిన ఆరోపణలపై చర్యలకి సిద్ధం అవుతున్న తరుణంలో డాక్టర్ కరుణ, వైశాలి టీం సెంటర్‌ని మూసివేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ లిక్కర్‌ స్కాం ఢిల్లీ స్కాం కంటే పెద్దది: మంత్రి నిమ్మల

రాష్ట్రంలో పాజిటివ్‌ గవర్నెన్స్‌: మంత్రి సత్యప్రసాద్‌

Read latest AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 28 , 2025 | 02:26 PM