Russia Response to Trump: ట్రంప్ బెదిరింపులకు భయపడం.. 50 రోజుల అల్టిమేటంపై రష్యా..
ABN , Publish Date - Jul 15 , 2025 | 07:09 PM
రష్యా 50 రోజుల్లోగా ఉక్రెయిన్‌తో యుద్ధవిరమణ ఒప్పందం కుదుర్చుకోకపోతే భారీ ఎత్తున సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలపై రష్యా ఘాటుగా స్పందించింది. ట్రంప్ బెదిరింపులకు లొంగమని..

Russia Reaction to Trump Tariff: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై ఒత్తిడి పెంచారు. ఉక్రెయిన్‌పై తక్షణమే దాడులు ఆపాలని.. 50 రోజుల్లోపు క్రెమ్లిన్ తో యుద్ధ విరమణ ఒప్పందం చేసుకుని తీరాలని హెచ్చరించారు. లేని పక్షంలో ఊహించని రీతిలో మాస్కోపై సుంకాల మోత మోగిస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఈ వ్యాఖ్యలపై రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందించారు. మా దేశం ఎవరి బెదిరింపులకు లొంగదంటూ ట్రంప్ హెచ్చరికలను కొట్టిపడేశారు.
రష్యాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 రోజుల గడువు పేరుతో అల్టిమేటం జారీ చేయడాన్ని క్రెమ్లిన్ పూర్తిగా తప్పుబట్టింది. రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ,'అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి. ముఖ్యంగా కొన్ని వ్యాఖ్యలు మా అధ్యక్షుడు పుతిన్‌ను వ్యక్తిగతంగా ఉద్దేశించి చేసినట్లుగా అనిపిస్తోంది. మేము ఎవరి అల్టిమేటమ్‌లను అంగీకరించము. వాషింగ్టన్ వ్యాఖ్యలపై విశ్లేషించుకునేందుకు మాకు సమయం పడుతుంది. అధ్యక్షుడు పుతిన్ అవసరమని భావిస్తే కచ్చితంగా స్పందిస్తారు.' అని పేర్కొన్నారు.
ట్రంప్ ఏమన్నాడు?
వైట్ హౌస్‌లో నాటో చీఫ్ మార్క్ రుట్టేతో భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు హెచ్చరికలు జారీ చేశారు. 50 రోజుల్లో రష్యా ఉక్రెయిన్‌తో ఒప్పందం కుదుర్చుకోకపోతే టారిఫ్ మోత మోగిస్తామని ప్రకటించారు. ఉక్రెయిన్‌కు రికార్డుస్థాయి ఆయుధాలతో పాటు పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థను పంపింస్తామని అన్నారు. తాను చాలా విషయాలకు వాణిజ్యాన్ని అస్త్రంగా వాడుకుంటానని.. ఇది గొప్పగా పనిచేస్తుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
అలాగే మాస్కోకు సాయం చేసే దేశాలపై 500% టారిఫ్ విధించేలా బిల్లులు రూపొందిస్తున్నట్లు రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహమ్ తెలిపారు. ఈ బిల్లు వల్ల రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై తీవ్రప్రభావం పడనుంది. అందులో భారత్, చైనా ప్రధానమైనవి.
ఇవి కూడా చదవండి..
శుభాంశు శుక్లా బృందాన్ని ఆసుపత్రికి తరలించిన నాసా..
భారత్, పాకిస్తాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
For More International News And Telugu News