Share News

France : వైద్యం ముసుగులో కామపిశాచం.. 299 మంది రోగులపై అత్యాచారం చేసిన దుర్మార్గుడు.. ఎక్కడంటే..

ABN , Publish Date - Feb 25 , 2025 | 03:47 PM

France Sexual Abuse: పవిత్ర వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా అమానుషంగా, క్రూరంగా ప్రవర్తించాడు ఫ్రాన్స్‌కు చెందిన ఓ డాక్టర్. నమ్మి తన వద్దకు పేషెంట్లను వారికే తెలియకుండా అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. చిన్నపిల్లలని కూడా చూడకుండా నీచానికి తెగబడ్డాడు. ఏకంగా 299 మందిపై అత్యాచారం చేశాడా దుర్మార్గుడు.

France : వైద్యం ముసుగులో కామపిశాచం.. 299 మంది రోగులపై అత్యాచారం చేసిన దుర్మార్గుడు.. ఎక్కడంటే..
French Surgeon Joel Rape Case

France Doctor Sexual Abuse: తమకంటే ఎక్కువగా డాక్టర్లనే నమ్ముతారు పేషెంట్లు. ప్రాణాలు కాపాడే వైద్యుడిని కనిపించే భగవంతుడని కీర్తిస్తారు. కానీ, ఈ నమ్మకాన్నే వమ్ము చేశాడు ఓ వైద్యుడు. 30 సంవత్సరాల పాటు చికిత్స పేరిట రోగులపై పైశాచికంగా అత్యాచారాలకు తెగబడ్డాడు. సర్వీసు మొత్తమ్మీద ఏకంగా దాదాపు 300మందిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వీరిలో ఎక్కువగా బలైంది అభం శుభం తెలియని చిన్నారులే. ఇన్నాళ్లూ గుట్టుగా వ్యవహారం సాగించిన ఆ కామ డాక్టర్ దారుణాలు.. అనుకోకుండా ఓ కేసుతో బట్టబయలయ్యాయి.


లక్షల సంఖ్యలో అశ్లీల ఫోటోలు..

74 ఏళ్ల జోయెల్‌ లి స్కౌర్నెక్‌ ఫ్రాన్స్‌లోని బ్రిటానీ అనే ప్రాంతంలో గతంలో సర్జన్‌గా పనిచేసేవాడు. విధుల్లో చేరినప్పటి నుంచే వైద్యం కోసం తన దగ్గరకు వచ్చే పేషెంట్లకు చికిత్స పేరుతో మత్తు మందు ఇచ్చి తన కోరికలు తీర్చుకునేవాడు. సర్వీస్‌లో ఉండగానే నన్నెవరూ పట్టుకోలేదు.. ఇప్పుడెవరు కనుక్కోగలరనే ధీమాతో 70 దాటాక కూడా అదే నీచపు మనస్తత్వంతో ఉండేవాడు. కానీ, 2017లో ఇంటి పక్కనే ఉన్న ఓ 6 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడనే ఆరోపణలతో తొలిసారి జోయెల్‌‌పై కేసు నమోదైంది. ఈ ఘటన తర్వాత కూడా నలుగురు చిన్నారులను అత్యాచారం చేశాడు. ఈ కేసు కోర్టులో నిరూపణ కావడంతో జోయెల్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. అనంతరం ఈ కేసును మరింత లోతుగా విచారించాలనే ఉద్దేశంతో పోలీసులు నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అప్పుడే జోయెల్ దారుణాల చిట్టా మొత్తం బయటికొచ్చింది. నిందితుడి ఇంట్లో ఏకంగా 3 లక్షలకు పైగా అశ్లీల ఫొటోలు, 650లకు అసభ్యకరమైన వీడియోలు వెలుగులోకి వచ్చాయి.


శివరాత్రికి ముందే మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం.. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారంటే..


జంతువులు, చిన్నారులనే తేడా లేకుండా..

జోయెల్ ఇంట్లో లభ్యమైన డైరీలోని వివరాలు చూసి పోలీసు అధికారులు కంగుతిన్నారు. ఎవరెవరిపై లైంగిక దాడి చేసింది పేర్లతో సహా రాసి పెట్టుకున్నాడు. జంతువులు, చిన్నారులే తనను ఎక్కువగా ఆకర్షిస్తారని నోట్ చేసుకున్నాడు. డైరీలోని లెక్కల ప్రకారం ఈ మాజీ సర్జన్ తన జీవితకాలంలో మొత్తం 299 మందిపై అత్యాచారం చేశాడంట. ఇదిలా ఉంటే, డైరీలో తమ పేర్లు ఉన్నాయని తెలిసి బాధితులు తమకీ విషయం ఇంతవరకూ తెలినే తెలియదని లబోదిబోమంటున్నారు.


వైద్యం ముసుగులో సైకో మనస్తత్వంతో ఎంతో మంది జీవితాలను నలిపేసిన జోయెల్ కేసు ఇటీవల కోర్టులో విచారణకు వచ్చింది. ఆ సందర్భంలో నిందితుడు తాను 1989 నుంచి 2014 మధ్య 299మందిపై అఘాయిత్యానికి పాల్పడ్డానని స్వయంగా ఒప్పుకున్నాడు. వీరిలో 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలు ఉన్నట్లు అంగీకరించాడు. బాధితుల్లో ఎక్కువగా చిన్నారులే ఉన్నారని.. ఈ నేరాలకు పూర్తి బాధ్యత వహిస్తున్నానని తెలిపాడు. విచారణ పూర్తయ్యాక నిందితుడి మరో 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.


Read Also : Sajjan Kumar: మాజీ ఎంపీకి జీవిత ఖైదు

Vivek Ramaswamy: ఆ విషయంలో వివేక్‌కే మా మద్ధతు.. ట్రంప్, మస్క్..

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 28 , 2025 | 01:08 PM