Unhealthy Breakfast: ఆరోగ్యానికి మంచివని బ్రేక్‌ఫాస్ట్‌గా ఇవి తింటున్నారా.. ఈ రోజే మానేయండి.. లేకపోతే ఈ సమస్యలు..
ABN , Publish Date - Apr 27 , 2025 | 03:11 PM
Foods to Avoid For Breakfast: ప్రతిరోజూ మన ఉదయాన్నే తీసుకునే ఆహారమే ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. చాలామంది తెలిసీ తెలియక ఆరోగ్యానికి మంచివనే ఉద్దేశాన్ని ఈ పదార్థాలను అల్పహారంగా తీసుకుంటారు. నిజానికి, ఆరోగ్యంగా కనిపించే ఈ పదార్థాలు చాలా హానికరమని మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Unhealthy Breakfast Choices: నేటి బిజీ జీవితంలో చాలామందికి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి తగినంత సమయం దొరకడం లేదు. అందుకని ఉదయం పూట ఆరోగ్యానికి మంచివనే ఉద్దేశంతో ఈ పదార్థాలే ఎక్కువగా తినేస్తున్నారు. నిజానికి రాత్రి భోజనం తర్వాత తీసుకునే అల్పాహారం చాలా ముఖ్యం. దినచర్య ప్రారంభించగానే తీసుకునే మొదటి ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. ఇది తెలియక చాలామంది ఆరోగ్యానికి మంచి చేసేవే అనుకుని ఇవే బ్రేక్‌ఫాస్ట్‌లో రోజూ తినేస్తున్నారు. కానీ, ఇవన్నీ అల్పాహారంలో ఖచ్చితంగా తినకూడని పదార్థాలు. ఆరోగ్యంగా కనిపించినా హాని కలిగిస్తాయి.
తృణధాన్యాలు
అల్పాహారంలో తృణధాన్యాలు తినడం మంచిదని తరచూ ఎవరో ఒకరు చెప్పగా వినే ఉంటారు. దాని లేబుల్‌పైన, సోషల్ మీడియాలో చూసి ఇది ఆరోగ్యకరమైనదని నమ్ముతారు. కానీ తృణధాన్యాలలో శుద్ధి చేసిన చక్కెర, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఈ పదార్థాలు ఉదయాన్నే తింటే అనారోగ్యానికి గురవుతారు.
పెరుగు
పెరుగులో ప్రోటీన్, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. కానీ వాటిని అల్పాహారంలో తీసుకోకూడదు. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం ఉదయాన్నే పెరుగు తినడం మంచిది కాదు. ఇది శరీరంలో శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుందని నమ్ముతారు.
ప్రోటీన్ బార్
సమయం లేకపోవడం వల్ల చాలా మంది అల్పాహారంగా ప్రోటీన్ బార్‌లను తినడానికి ఇష్టపడతారు. కానీ మీరు దానిని తినడం మానుకోవాలి. ఈ ప్రోటీన్ బార్లలో తగినంత ప్రోటీన్ ఉండకపోగా చక్కెర అధికంగా ఉంటుంది.
పండ్ల రసం
పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ ఉదయం లేవగానే తీపి పండ్ల రసం తాగడం వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయి. వీటిలో ఫైబర్ కూడా ఉండదు. పండ్ల రసానికి బదులుగా మీరు నిమ్మకాయ నీరు లేదా దోసకాయ రసం తాగవచ్చు.
వేఫెల్స్, ప్యాన్ కేకులు
వేఫెల్స్, ప్యాన్ కేకులు నిజానికి ఒక గొప్ప అల్పాహార ఎంపిక. వీటిని సాధారణంగా శుద్ధి చేసిన తెల్ల పిండితో తయారు చేస్తారు. కానీ, ఇన్‍స్టంట్ ఫుడ్ అయితే మాత్రం ఇందులో చక్కెర సిరప్, వెన్న కలుపుతారు. కాబట్టి, ఇది అస్సలు ఆరోగ్యకరమైనది కాదు.
Read Also: Diabetes: డయాబెటిస్‌కు చికిత్స ఆలస్యమైతే ఏమవుతుంది.. ఒకసారి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే ఆపేయవచ్చా..
Diabetes: రాత్రి నిద్రపోతున్నప్పుడు ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. ఇవి షుగర్‌కు
Hot Water Side Effects: మీకు ఈ సమస్యలు ఉంటే వేడి నీళ్లు తాగడం మంచిది కాదు..