Share News

Low Sugar Diet: డయాబెటిస్ భయంతో చక్కెర తినడం తగ్గించారా.. ఇలా చేస్తే ఏం జరుగుతుంది..

ABN , Publish Date - Apr 19 , 2025 | 05:39 PM

Low Sugar Diet Health Effects: చక్కెర కలిగిన పదార్థాలు అధికంగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతూ పోయి డయాబెటిస్ వస్తుందని అనుకుంటారు. షుగర్ తినడం తగ్గిస్తే ఈ సమస్య దూరమవుతుందని అభిప్రాయపడుతుంటారు. మరి, ఈ లో షుగర్ డైట్ పద్ధతి వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది. ఇలా చేయడం కరెక్టా.. తప్పా.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు.

Low Sugar Diet: డయాబెటిస్ భయంతో చక్కెర తినడం తగ్గించారా.. ఇలా చేస్తే ఏం జరుగుతుంది..
Low Sugar Diet Effects On Health

Sugar Free Diet Benefits: గత కొన్నేళ్లుగా చక్కెర వినియోగం బాగా పెరిగింది. ప్యాక్ చేసిన ఆహారం నుండి పానీయాల వరకు ప్రతి ఆహారంలో చక్కెర పదార్థాలను పెద్ద మొత్తంలో కలుపుతున్నారు. ప్రజలు ఇంట్లో తయారుచేసిన ఆహారం కంటే బయటి ఆహారం తినేందుకు ఎక్కువ ఇష్టపడుతుండటం వల్లే డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతోంది. ఈ విషయాలను తెలుసుకుని కొందరు ముందు జాగ్రత్త చర్యగా ప్రతిరోజూ లో షుగర్ డైట్ పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారు. ఇలా చక్కెర వినియోగం తగ్గిస్తే మధుమేహం రాకుండా ఉండేందుకు అవకాశముందా.. పోషకాహార నిపుణులు ఏమంటున్నారు. చక్కెర వాడకాన్ని తగ్గిస్తే శరీరానికి ఏం జరుగుతుందో తెలుసుకోండి.


శక్తి స్థాయిలు

చక్కెర తినడం తగ్గించినప్పుడు శరీరంలో శక్తి రోజంతా స్థిరంగా ఉంటుంది. రక్తంలోని చక్కెరలో వేగంగా హెచ్చుతగ్గులు ఏర్పడవు. ఎక్కువసేపు ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఒకవేళ ఎక్కువగా తింటే శక్తి వేగంగా ఖర్చయ్యి త్వరగా అలసిపోతారు. శరీరంలోని కార్బోహైడ్రేట్లు, కొవ్వులు వేగంగా కరిగిపోతాయి.


చర్మ ఆరోగ్యం

చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల మొటిమలు, మంట, అకాల వృద్ధాప్యం వంటి చర్మ సమస్యలు వస్తాయి. ఇక చక్కెర ఇన్సులిన్ స్థాయిలు చర్మ రంధ్రాలు మూసుకుపోయేందుకు దారితీస్తుంది. అలాంటి సందర్భాల్లో చర్మం నుంచి నిత్యం జిడ్డుకారుతూనే ఉంటుంది. అదే మీరు చక్కెర వినియోగాన్ని తగ్గిస్తే చర్మం ముడతలు తగ్గి బిగుతుగా తయారై కొత్త మెరుపు వస్తుంది.


బరువు

కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల చక్కెర తింటే శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. ముఖ్యంగా కడుపు చుట్టూ పేరుకుపోతాయి. ఆకలిని నియంత్రించే లెప్టిన్ వంటి హార్మోన్ల పనికి చక్కెర ఆటంకం కలిగిస్తుంది. అందుకే తీపి తినడం తగ్గిస్తే ఆటోమేటిగ్గా కేలరీలను తగ్గిపోతాయి. బరువు కూడా సులువుగా తగ్గగలుగుతారు.


దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం

తీపి తినడం తగ్గించడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, కొవ్వు కాలేయం, కొన్ని క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అధిక చక్కెర వాపు, ట్రైగ్లిజరైడ్లు, ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. కాబట్టి, దీర్ఘకాలిక వ్యాధులకు దోహదం చేసే చక్కెర వినియోగం తగ్గించడం మంచిదే.


మంచి మూడ్

లో షుగర్ డైట్ వల్ల మొదట్లో మీకు చిరాకు లేదా మూడీగా అనిపించవచ్చు. కానీ కాలక్రమేణా మీ శరీరం అలవాటు పడుతున్న కొద్దీ ఉత్సాహంగా మారిపోతారు. మానసిక స్థితి మెరుగవుతుంది. ఏకాగ్రత కూడా పెరుగుతుంది.


పేగు ఆరోగ్యం

చక్కెర మీ పేగులలోని చెడు బ్యాక్టీరియా, ఈస్ట్‌ను తినేస్తుంది. ఇది ఉబ్బరం, గ్యాస్, అసమతుల్యతకు దారితీస్తుంది. అదే తీపి తినడం తగ్గిస్తే ఆరోగ్యకరమైన సూక్ష్మజీవులు పెరుగుతాయి. జీర్ణక్రియ, పోషకాల శోషణ, రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తాయి.


రోగనిరోధక శక్తి

అధిక చక్కెర స్థాయిలు తెల్ల రక్త కణాల పనితీరును మందగింపజేసి రోగనిరోధక ప్రతిస్పందనలను బలహీనపరుస్తాయి. మీరు తక్కువ చక్కెరను తినేటప్పుడు రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్లు, వాపులతో పోరాడేందుకు సమర్థవంతంగా మారుతుంది. తద్వారా జలుబు, ఇతర అనారోగ్యాలకు గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది.


Read Also: Mangoes: మామిడిపండు తినగానే ఈ 5 పదార్థాలు తినకండి.. చాలా ప్రమాదకరం..

Jamun Benefits: నేరేడు పండ్ల విత్తనాలు పారేస్తున్నారా.. ఇలా వాడితే ఆ సమస్యలు పోతాయ్....

Best Time To Eat Sugar: ఈ టైమ్‌లో స్వీట్స్ తింటే నో టెన్షన్

Updated Date - Apr 19 , 2025 | 09:12 PM