Share News

Women's Day 2025: మహిళలకు స్పెషల్.. ఇవి తింటే.. ఎప్పటికీ ముసలోళ్లు అవ్వరంతే..

ABN , Publish Date - Mar 08 , 2025 | 03:00 PM

International Womens Day 2025: ఇంట్లో అందరి పనులు ఒంటి చేత్తో చేసే మహిళలు తమ వ్యక్తిగత పనులు పూర్తిచేసుకోవడంలో అశ్రద్ధ వహిస్తుంటారు. మరీ ముఖ్యంగా జీవనశైలి, ఆహారపు అలవాట్ల విషయంలో. ఈ రెండు విషయాల్లో చేసే నిర్లక్ష్యమే వారి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మరి, మహిళలు ఏ వయసులో అయినా నిత్యయవ్వనంగా, ఉత్సాహంగా ఉండాలంటే..

Women's Day 2025: మహిళలకు స్పెషల్.. ఇవి తింటే.. ఎప్పటికీ ముసలోళ్లు అవ్వరంతే..
Healthy Food Habits For Women

International Womens Day 2025: ప్రతి సంవత్సరం మార్చి 8న సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ఇలా అన్ని రంగాలకు చెందిన మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఎన్నో ఆర్థిక అసమానతలు, విద్య, ఉద్యోగ అవకాశాలు ఇలా ఎన్నో అంశాలపై చర్చిస్తారు. కానీ, ఈ పనులన్నీ సమర్థంగా చేయగలిగే సత్తా రావాలంటే ముందుగా శ్రద్ధ వహించాల్సింది ఫిట్‌నెస్, ఆరోగ్యంపైనే. అందుకే ఏ రకమైన ఆహారం తీసుకుంటే మహిళలకు నిత్యయవ్వనంతో, ఆరోగ్యంగా ఉండగలుగుతారో ఇప్పుడు మీకు చెప్తాం..ప్రతి మహిళా తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇది..


ప్రతి స్త్రీ తన రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన 5 ఆహారాలు :

1. అవిసె గింజలు

Aviselu.jpgఅవిసె గింజలలో ఈస్ట్రోజెన్ లక్షణాలున్న లిగ్నన్లు పుష్కలంగా ఉంటాయి. మీ ఆహారంలో అవిసె గింజలను చేర్చుకోవడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులను నిర్వహించుకోవడం సులభమవుతుంది. తద్వారా రుతుక్రమ చర్యను క్రమబద్ధీకరిస్తుంది. అందుకే ప్రతిరోజూ పెరుగుపై అవిసె గింజలను చల్లుకోండి లేదా స్మూతీలలో కలుపుకుని తినవచ్చు.


2. ఆకుకూరలు

vegetables.jpgఆకుకూరలను మహిళలు రోజువారీ ఆహారంలో కచ్చితంగా భాగంగా చేసుకోవాలి. పాలకూర, మెంతికూర, మునక్కాయ , కరివేపాకు, క్యాలీఫ్లవర్, కొల్లార్డ్ గ్రీన్స్, క్యాబేజీ, ఆవాలు వంటి ఆహారాలు ఇందులో ఉన్నాయి. పోషకాహార నిపుణుల ప్రకారం, ఆకుకూరల్లో ఐరన్, ఫోలిక్ ఆమ్లం (విటమిన్ B9),కాల్షియం అధికంగా ఉంటాయి. మహిళల ఆరోగ్యానికి ఈ మూడు పోషకాలను ఎంతో అవసరం. మరీ ముఖ్యంగా గర్భధారణ, పీరియడ్స్ సమయంలో ఐరన్ చాలా ముఖ్యమైన పోషకం. ఎర్ర రక్త కణాల పెరుగుదలకు, ఉత్పత్తికి విటమిన్ B9 ఉత్పత్తికి ఇది తోడ్పడుతుంది. కాల్షియం ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాల అభివృద్ధికి సహాయపడుతుంది.


3. పెరుగు

curd.jpgపెరుగును కొన్ని పండ్లు, డ్రై ఫ్రూట్స్‌తో కలిపి తింటే అద్భుతమైన పోషకాలు కలిగిన శక్తిమంతమైన అల్పాహారంగా మారుతుంది. ఇందులో పేగు ఆరోగ్యానికి కావాల్సిన ప్రోబయోటిక్స్, ఎముకలకు అవసరమయ్యే కాల్షియం ఉంటాయి. 'హీలింగ్ ఫుడ్స్' పుస్తకం ప్రకారం, ప్రూనే, ఆప్రికాట్ వంటి ఎండిన పండ్లతో పెరుగును కలిపి తింటే రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయవచ్చు. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆప్రికాట్లు కంటి చూపుకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి, అయితే ప్రూనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలం.


4. చికెన్

chicken.jpgమాంసాహారం తినే మహిళలకు చికెన్ పోషకాహారం. పునరుజ్జీవనం కోసం ఒక గొప్ప ఆహార ఎంపిక. పోషకాహార నిపుణుల ప్రకారం, చికెన్‌ రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటుంది. శరీరం శక్తిని ఉత్పత్తి చేయడంలో సహాయపడే అధిక విటమిన్ బి అధిక మొత్తంలో లభ్యమవుతుంది. మీరు చికెన్‌ను వెల్లుల్లి (ఇందులో గుండెను రక్షించే పదార్థాలు), అల్లం (ఇదివృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది), నిమ్మకాయ (విటమిన్ సికి అద్భుతమైన మూలం) తో ఉడికిస్తే అద్భుతమైన పోషకాలు పొందుతారు.


5. తృణధాన్యాలు మరియు చిరు ధాన్యాలు

millets.jpgరాగుల్లో (ఫింగర్ మిల్లెట్) కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. బలమైన ఎముకలు, హార్మోన్ల సమతుల్యతకు ఇది సరైనది.

సజ్జల్ని (pearl millet)ఐరన్ పవర్‌హౌస్ అంటారు. ఇందులో శక్తి స్థాయిలను పెంచే పోషకాలు మెండు.

జొన్నలు గ్లూటెన్ రహిత ధాన్యం. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

తోటకూర గింజలు లేదా (Rajgira)రాజ్‌గిర రోగనిరోధక శక్తికి అద్భుతమైనది.

పాలిష్ చేయని చిన్న ధాన్యపు బియ్యం, ఎర్ర బియ్యం కూడా పోషకాలు అధికంగా ఉంటాయి.


Read Also : Watermelons: జర.. చూసి తినండి..

Aloe vera for Bald Patches: నెత్తిపై జుట్టు ప్యాచులుగా ఊడిపోతోందా?

Copper Bottles Vs Steel Bottes: స్టీల్ నీళ్ల బాటిల్స్ కంటే రాగి నీళ్ల బాటిల్స్ ఆరోగ్యకారకమా

Updated Date - Mar 08 , 2025 | 03:06 PM