Kidney Problem: మీ కిడ్నీ ఆరోగ్యంగా ఉందా.. ఇంట్లోనే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు..
ABN , Publish Date - Apr 29 , 2025 | 10:36 AM
Kidney Health Self Check: మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేది సాధారణంగా రక్త పరీక్ష ద్వారానే నిర్ణయిస్తారు. కానీ, టెస్ట్ చేసుకోకుండా కూడా మీరు ఇంట్లోనే కిడ్నీల మూత్రపిండాల సులభంగా చెక్ చేసుకోవచ్చు. అదెలాగంటే..

Kidney Problems Symptoms: మూత్రపిండాలు మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. శరీరం నుండి విష పదార్థాలను తొలగించి ఆరోగ్యంగా ఉండేందుకు నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే ఒంట్లో వ్యర్థాలు పేరుకుపోయి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ రోజుల్లో చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా శరీర భాగాలు వేగంగా దెబ్బతింటున్నాయి. అందుకే శరీర భాగాల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మూత్రపిండాల గురించి. టెస్టులతో పనిలేకుండా ఈ లక్షణాల ద్వారా ఇంట్లోనే కిడ్నీ ఆరోగ్యాన్ని సులభంగా తనిఖీ చేసుకోవచ్చు.
మూత్రం రంగు
మూత్రం రంగులో మార్పు ద్వారా మూత్రపిండాల ఆరోగ్యాన్ని గుర్తించవచ్చు. మూత్రం ఎక్కువగా లేదా తక్కువగా రావడం, రక్తం లేదా పసుపు రంగు మూత్రం, మూత్రంలో ఫోమ్ కనిపిస్తే కిడ్నీ సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. త్వరగా డాక్టరును సంప్రదిస్తే మందుల ద్వరా కూడా మూత్రం రంగు మారవచ్చు.
శరీరంలో మార్పులు
అలసట, చేతులు, కాళ్ళలో వాపు, మూత్ర విసర్జన విధానంలో మార్పు, పొడి చర్మం, కండరాల నొప్పి కూడా మూత్రపిండాల సమస్యలకు సంకేతాలు కావచ్చు.
వాపు
కాళ్ళు, చీలమండలు లేదా ముఖంలో అనవసరమైన వాపు మూత్రపిండాలలో నీరు పేరుకుపోవడానికి సంకేతం కావచ్చు. మీ శరీరంలోని ఏ భాగంలోనైనా వాపు కనిపిస్తే వెంటన తనిఖీ చేసుకోండి.
దురద
మూత్రపిండాల వ్యాధి కారణంగా చర్మం దురద అనేది చాలా సాధారణ సమస్య. ముఖ్యంగా డయాలసిస్ చేయించుకుంటున్న వారిలో ఈ లక్షణం కనిపించే ఛాన్సుంది.
చర్మం రంగు
మూత్రపిండాల సమస్యలు ఉన్నట్లయితే చర్మం పసుపు రంగులోకి మారవచ్చు. దీనితో పాటు గోళ్ల రంగు కూడా మారవచ్చు.
సాధారణ చెకప్‌లు
డయాబెటిస్ లేదా అధిక రక్తపోటు వంటి వ్యాధులు ఉంటే డాక్టరుతో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఈ వ్యాధులు మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతాయి.
Mixed Fruit Effects: ఈ పండ్లను కలిపి తింటున్నారా.. మీరు హెల్త్ డేంజర్ జోన్ లో
Diabetics: డయాబెటిస్ ఉన్నవారు నెయ్యి తినొచ్చా.. డాక్టర్లు ఏమంటున్నారు..