Share News

COVID Vaccine: బూస్టర్ డోస్ తీసుకున్న వారికి కొవిడ్ రాదా? నిపుణులు ఏమంటున్నారు?

ABN , Publish Date - May 31 , 2025 | 04:40 PM

COVID-19 Vaccine Effectiveness: కరోనా కేసులు ఇటీవల భారతదేశంలో కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో ప్రజలు కలవరపడుతున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నవారికి కొవిడ్ మళ్లీ వచ్చే ప్రమాదముందా? దీనిపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు.

COVID Vaccine: బూస్టర్ డోస్ తీసుకున్న వారికి కొవిడ్ రాదా? నిపుణులు ఏమంటున్నారు?
COVID Vaccine Impact On Variants

COVID Vaccine Impact On Emerging Variants: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. కొన్ని నెలల కిందటి వరకూ ఆసియాలోని పలు దేశాలను కుదిపేసిన కొవిడ్ కొత్త వేరియంట్లు ఇప్పుడు భారతదేశంలోనూ అడుగుపెట్టాయి. క్రమంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతూ పోతుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొవిడ్ నివారణకు ప్రజలు తీసుకున్న వ్యాక్సిన్ పనితీరుపై చర్చ మొదలైంది. బూస్టర్ డోస్ తీసుకున్న వ్యక్తులు మళ్లీ కొవిడ్ ఇన్ఫెక్షన్ బారిన పడతారా? లేదా ఈసారి మళ్ళీ టీకాలు వేసుకోవాల్సి వస్తుందా? ఈ సందేహాలపై వైద్యులు ఏమంటున్నారు?


ప్రపంచంలోని పలు దేశాలతో పాటు భారతదేశంలో కూడా కొవిడ్ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మన దేశంలో ఇప్పటికే 1000 కి పైగా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కేరళలో (430), అత్యల్ప సంఖ్యలో ఢిల్లీలో (126) కొవిడ్ బారిన పడ్డారు. మహారాష్ట్రతో సహా అనేక ఇతర రాష్ట్రాల్లోనూ కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య కేవలం రెండు వారాల్లోనే రెట్టింపు కావడం గమనార్హం. కొవిడ్ వ్యాప్తి వేగాన్ని చూసి మునుపటిలాగే వస్తుందేమో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.


కలవరం పుట్టిస్తున్న కొత్త వేరియంట్స్

ఈసారి ఇండియాలో కొవిడ్ వైరస్ కొత్త వేరియంట్స్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా కొత్త వేరియంట్ రోగనిరోధక శక్తి నుంచి కూడా తప్పించుకోవచ్చని అనుమానిస్తున్నారు. దీనివల్ల ఎక్కువ మంది ప్రజలు వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని అంచనా. దీంతో కొత్త వేరియంట్ ప్రమాదాలను నివారించడానికి టీకా గురించి చర్చ కూడా ప్రారంభమైంది. అయితే కొత్త వేరియంట్లు అంత తీవ్రమైనవి కావని.. ప్రస్తుతానికి అవి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.


టీకాలు వేసిన వారికి కూడా ఇన్ఫెక్షన్ వస్తుందా?

కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ లేదా రెండు డోసులు తీసుకున్న వ్యక్తులకు కొత్త వేరియంట్స్ సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారికి ఈ వ్యాధి సోకినప్పటికీ తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో బాధపడరు. ఇప్పటివరకు జరిగిన పరిశోధనల ప్రకారం కొత్త వేరియంట్ ప్రభావం 4 లేదా 8 రోజుల పాటు ఉంటుంది. అందువల్ల దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్ వాడాలి.


బూస్టర్ డోస్ తీసుకున్న వారిలో వైరస్ కు వ్యతిరేకంగా పోరాడే రోగనిరోధక శక్తి ఉందని డాక్టర్లు అంటున్నారు. వారికి వైరస్ నుండి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది, అయితే బూస్టర్ తీసుకునే వారికి ఇన్ఫెక్షన్ అస్సలు రాదనే విషయం నిజం కాదు. వారికి కూడా ఇన్ఫెక్షన్ సోకవచ్చు, కానీ లక్షణాలు తీవ్రంగా ఉండే అవకాశం లేదు.


ఇవి కూడా చదవండి:

ప్రతి మహిళ తప్పక చేయించుకోవాల్సిన 8 ఆరోగ్య పరీక్షలు..

నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం..

Read Latest and Health News

Updated Date - May 31 , 2025 | 05:07 PM