Health Tips : ఈ 5 శరీర భాగాలను.. చేతులతో తరచూ తాకితే ఇన్ఫెక్షన్..
ABN , Publish Date - Feb 24 , 2025 | 08:12 PM
Don't Touch These 5 Body Parts With Hand : శరీరంలోని కొన్ని భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం, మీ శరీరంలోని ఈ 5 భాగాలను తరచూ తాకడం చాలా చెడ్డ అలవాటు. ఇలా చేస్తే ఆయా భాగాలకు ఇన్ఫెక్షన్ లేదా అనేక వ్యాధులు వచ్చే ప్రమాదముంది. అందువల్ల..

Don't Touch These 5 Body Parts With Hand : మనల్ని మనం తాకడం అనేది మనమందరం దాదాపు ప్రతిరోజూ చేసే చాలా సాధారణ విషయం. తెలిసి లేదా తెలియకుండా మీ ముఖాన్ని తాకడం లేదా ఎటువంటి కారణం లేకుండా మీ భుజాలు లేదా పాదాలను తాకడం సహజం. మన శరీరాన్ని మనం తాకితే ఏమవుతుందని మీరు అనుకోవచ్చు. మనం పెద్దగా ఆలోచించని ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు అనేక హెచ్చరికలు చేస్తున్నారు. నిజానికి మనం చేతులతో రోజంతా చాలా వస్తువులను తాకుతాం. దీనివల్ల చేతులపై క్రిములు, బ్యాక్టీరియా చేరటం సహజం. అటువంటి పరిస్థితిలో మీరు అవే చేతులతో శరీరంలోని కొన్ని సున్నితమైన భాగాలను తాకినప్పుడు వాటికి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం పెరుగుతుంది. అందుకే, శరీరానికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదా వ్యాధి వ్యాప్తి చెందకుండా అరికట్టాలంటే ఈ శరీర భాగాలను తాకకుండా ఉండండి.
ముఖం..
మీ ముఖంపై మొటిమలు, పిగ్మెంటేషన్, దురద లేదా దద్దుర్లు వంటి సమస్యలు ఎల్లప్పుడూ ఉంటే.. ముఖాన్ని పదే పదే తాకే అలవాటు దీనికి కారణం కావచ్చు. నిజానికి, చేతులపై చాలా క్రిములు, ధూళి మరియు బ్యాక్టీరియా ఉంటాయి. దీని కారణంగా ముఖంపై అనేక రకాల చర్మ సమస్యలు వస్తాయి. ఇది కాకుండా చేతుల్లో ఉండే సహజ నూనె ముఖం రంధ్రాలను మూసివేసేలా చేస్తుంది. మరి, మీ చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉండాలంటే చేతులతో పదే పదే ముఖాన్ని తాకడం మానుకోండి.
చెవుల్లో వేళ్లు పెట్టుకోవడం..
వేళ్ళు చెవుల్లో పెట్టుకుని తిప్పుకోవడం సరదాగా అనిపించవచ్చు. కానీ ఈ చిన్న అలవాటు చాలా హానికరం కావచ్చు. మన చెవుల లోపలి భాగాలు కూడా చాలా సున్నితంగా ఉంటాయి. అందువల్ల ఏమైనా పొరపాటు జరిగితే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ప్రమాదముంది. చేతులపై ఉండే బ్యాక్టీరియా చెవుల్లో ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు గొంతు వరకు వ్యాపించి మరింత ప్రమాదకరమైన పరిస్థితిని సృష్టించవచ్చు. అందువల్ల, మీ చెవుల లోపల వేళ్లు పెట్టకండి.
నోటిలో వేలు పెట్టుకుంటే..
చాలా మందికి ఎటువంటి కారణం లేకుండా నోట్లో వేళ్లు పెట్టుకునే అలవాటు ఉంటుంది. తిన్న తర్వాత నోటిలో ఇరుక్కున్న ఆహారాన్ని తొలగించడానికి తమ వేళ్లను ఉపయోగిస్తారు. అయితే, ఈ అలవాటు అస్సలు సరైనది కాదు. దీనివల్ల చేతులపై ఉన్న బ్యాక్టీరియా, క్రిములు కడుపులోకి చేరే ప్రమాదం పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ చిన్న అలవాటు కడుపులో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలతో పాటు ఫుడ్ పాయిజనింగ్ వంటి వ్యాధులకు కారణమవుతుంది.
కళ్ళను పదే పదే నులమడం..
కళ్ళు మన శరీరంలో చాలా సున్నితమైన భాగం. కాబట్టి వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది వ్యక్తులు తమ చేతులతో పదే పదే కళ్ళను తాకుతుంటారు. కొన్నిసార్లు తట్టుకోలేనంత దురద పుట్టి ఇంకా గట్టిగా కళ్లు నులుముతారు. ఇది అస్సలు సరైనది కాదు. దీని కారణంగా కళ్ళలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతుంది. నిజానికి, చాలా కంటి ఇన్ఫెక్షన్లు చేత్తో కళ్లను తాకడం వల్ల సంభవిస్తాయి.
ముక్కులో వేలు పెట్టకండి..
ముక్కులో వేలు పెట్టడం చూసేందుకు చెడుగా కనిపించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరం. ముక్కులో వేలు పెట్టుకునే అలవాటున్న వారే ఎక్కువగా అనారోగ్యంతో ఉంటారని అనేక అధ్యయనాలు నిరూపించాయి. మీ ముక్కును శుభ్రం చేసుకోవలసి వస్తే శుభ్రమైన గుడ్డ లేదా రుమాలు వాడటం అలవాటు చేసుకోండి. అంతే కానీ, అందుకోసం చేతి వేళ్లను మాత్రం ఉపయోగించకండి.
Read Also : Health Tips : ఖాళీ కడుపుతో టమాటా జ్యూస్ తాగితే..ఈజీగా బరువు తగ్గుతారు..
Boil Milk in Right Way : పాలు ఇలా మరిగించకపోతే.. చాలామంది చేసే మిస్టేక్స్ ఇవే..
మరిన్ని ఆరోగ్య, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..