Cashews For Diabetics: జీడిపప్పు .. మధుమేహ రోగులకు మిత్రువా? శత్రువా?
ABN , Publish Date - May 04 , 2025 | 01:16 PM
Cashews And Blood Sugar: మధుమేహం వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవడం పెద్ద సవాలే. అందరిలా అన్ని రకాల ఆహార పదార్థాలు తినలేరు. అయితే, జీడిపప్పు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయనేది కొందరి వాదన. ఇది కేవలం అపోహ. లేకపోతే నిజంగానే జీడిపప్పు డయాబెటిక్ రోగులకు మంచిదేనా.. డాక్టర్లు ఏమంటున్నారు.

Best nuts For Blood Sugar Control: జీడిపప్పులు రుచి, పోషకాలకు ప్రసిద్ధి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు ఆరోగ్యానికి చాలా మంచిది. జీడిపప్పు రోజుకో గుప్పెడు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. మరి, ఆరోగ్యవంతులతో పాటు వీటిని డయాబెటిక్ రోగులు కూడా తినవచ్చా. జీడిపప్పు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయా? తగ్గుతాయా? తదితర విషయాల గురించి తెలుసుకుందాం.
కార్బోహైడ్రేట్ కంటెంట్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI)
75 గ్రాముల జీడిపప్పులో దాదాపు 20 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వీటిలో మూడు గ్రాములు డైటరీ ఫైబర్ అంటే మొత్తం కార్బోహైడ్రేట్ కంటెంట్ కేవలం 17 గ్రాములు. ఇక కేలరీలు కేవలం 440 మాత్రమే ఉంటాయి. అంటే దీని అర్థం కార్బోహైడ్రేట్లు కేలరీలను ప్రభావితం చేయవు. బ్రెడ్, పాస్తా మొదలైన అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలతో పోలిస్తే జీడిపప్పు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్వల్పంగా లేదా మధ్యస్థంగా పెరుగుతాయి. అంతేకాకుండా, జీడిపప్పులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. 75 గ్రాముల జీడిపప్పులో గ్లైసెమిక్ ఇండెక్స్ 22 మాత్రమే ఉంటుంది. కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉండటం వల్ల గ్లైసెమిక్ లోడ్ (GL) కూడా స్వల్పంగానే ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, తక్కువ GI, GL గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహార ఎంపికలు.
అధిక ప్రోటీన్, కొవ్వులు
జీడిపప్పులో ప్రోటీన్లు, కొవ్వులు చాలా ఎక్కువగా ఉంటాయి. 75 గ్రాముల జీడిపప్పులో 14 గ్రాముల ప్రోటీన్, 34 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇందులోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి. జీర్ణక్రియ నెమ్మదించి మీకు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. కొవ్వులతో పోలిస్తే ఇందులో ఒలీక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇక జీడిపప్పులోని మెగ్నీషియం గ్లూకోజ్ జీవక్రియ, ఇన్సులిన్ సెన్సిటివిటీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి శరీర కణాలు ఇన్సులిన్ అనే హార్మోన్ను ఉపయోగించుకోవడంలో మెగ్నీషియం సహాయపడుతుంది. కాబట్టి జీడిపప్పు డయాబెటిక్ పేషెంట్లకు చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
డయాబెటిస్ ఉన్నవారికి ఇది అవసరమా?
ఒక గిన్నె జీడిపప్పు రక్తంలో చక్కెర స్థాయిలను కొద్దిగా పెంచినప్పటికీ మధుమేహం ఉన్నవారు తాము ఎంత తింటున్నారో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా తినకూడదు. జీడిపప్పును అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితం కాకపోయినా అవి కేలరీలను పెంచుతాయి . బరువు పెరగడానికి దారితీస్తాయి. రక్తంలో చక్కెర పెరుగుదలను సమతుల్యం చేయడానికి మీరు జీడిపప్పును అధికంగా తీసుకుంటుంటే దీనిని ఫైబర్-రిచ్ లేదా ప్రోటీన్-రిచ్ ఫుడ్స్, వెజిటబుల్ సలాడ్లు, పెరుగు మొదలైన వాటితో కలిపి తినండి.
Read Also: Youth Heart Attack: యువతలో పెరుగుతున్న గుండెపోటు కేసులు.. కారణాలివే.. తప్పక తెలుసుకోండి..
Summer Drinks: లెమన్ జ్యూస్ చేస్తున్నారా.. వేసవిలో ఈ పొరపాట్లు చేస్తే రుచిలో తేడా..
Low BP Symptoms: ఈ 5 లక్షణాలు మీలో ఉన్నాయా.. అయితే లో బీపీ ఉన్నట్టే..