Share News

Law Entrance Test: ఆల్‌ ఇండియా లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌- 2026

ABN , Publish Date - Jul 28 , 2025 | 07:52 AM

‘ఆల్‌ ఇండియా లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌ - 2026’ నోటిఫికేషన్‌ను ఢిల్లీలోని ‘ద నేషనల్‌ లా యూనివర్సిటీ’ విడుదల చేసింది. ఐదు సంవత్సరాల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ లా(బీఏ ఎల్‌ఎల్‌బీ)(ఆనర్స్‌), ఒక సంవత్సరం మాస్టర్‌ ఆఫ్‌ లా(ఎల్‌ఎల్‌ఎం) ప్రోగ్రామ్‌లకు సంబంధించిన ఈ ఎంట్రెన్స్‌ పరీక్ష 2025 డిసెంబర్‌ 14న జరుగుతుంది.

Law Entrance Test: ఆల్‌ ఇండియా  లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌-  2026

‘ఆల్‌ ఇండియా లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌ - 2026’ (All India Law Entrance Test) నోటిఫికేషన్‌ను ఢిల్లీలోని ‘ద నేషనల్‌ లా యూనివర్సిటీ’ విడుదల చేసింది. ఐదు సంవత్సరాల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ లా(బీఏ ఎల్‌ఎల్‌బీ)(ఆనర్స్‌), ఒక సంవత్సరం మాస్టర్‌ ఆఫ్‌ లా(ఎల్‌ఎల్‌ఎం) ప్రోగ్రామ్‌లకు సంబంధించిన ఈ ఎంట్రెన్స్‌ పరీక్ష 2025 డిసెంబర్‌ 14న జరుగుతుంది. ఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీలో అడ్మిషన్‌ కోసం ఏఐఎల్‌ఈటీ స్కోరును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. (‘క్లాట్‌’, ‘ఎల్‌శాట్‌’తో ఇక్కడ అడ్మిషన్‌ లభించదు).


విద్యార్హత: ఐదు సంవత్సరాల కోర్సుకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్‌మీడియేట్‌ పూర్తి చేసి ఉండాలి. ఓబీసీలకు 42, ఎస్సీ/ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయస్సు: ఏఐఎల్‌ఈటీ ప్రోగ్రామ్‌లో చేరడానికి ఎలాంటి గరిష్ఠ, కనిష్ఠ వయస్సు నిబంధనలు లేవు.

పరీక్ష విధానం: మొత్తం మూడు సెక్షన్లతో 150 మార్కులు, 150 ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉంటుంది. నిర్ణీత సమయం రెండు గంటలు. ఇందులో నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. తప్పుగా గుర్తించిన ప్రతీ సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు.


సెక్షన్‌ ఏ: ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ - 50 మార్కులు - 50 ప్రశ్నలు

సెక్షన్‌ బి: కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌ - 30 మార్కులు - 30 ప్రశ్నలు

సెక్షన్‌ సి: లాజికల్‌ రీజనింగ్‌ - 70 మార్కులు - 70 ప్రశ్నలు

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు 3500/-. ఎస్సీ/ఎస్టీ, ఆర్థికంగా వెనకబడిన అభ్యర్థులకు 1500/-. 2025 ఆగస్ట్‌ 7 నుంచి 2025 నవంబర్‌ 10లోపు ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఏఐఎల్‌టీఈ 2026 కోసం nationallawuniversitydelhi.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ఎంట్రెన్స్‌ పరీక్ష కేంద్రాలు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్నంలో ఉన్నాయి.

చిరునామా: National Law University, Delhi, Sector-14, Dwaraka, New Delhi - 110078, India, 011- 40787555

(10:00 am to 05:00 pm on all working days)

ailetsupport@nludelhi.ac.in


ఈ వార్తలు కూడా చదవండి


అలర్ట్.. పరీక్షల విషయంలో కొత్త రూల్స్ జారీ..

ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థులకు శుభవార్త!

For More Educational News And Telugu News

Updated Date - Jul 28 , 2025 | 07:53 AM