Home » Notifications
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ - పంచాయతీరాజ్‘(ఎన్‌ఐఆర్‌డీపీఆర్)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ట్రైబల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్(పీజీడీటీడీఎమ్), ప్రోగ్రామ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్యలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను కోరుతున్నారు.
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ‘మ్యాట్ 2025’ సెప్టెంబర్ సీజన్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఉద్దేశించిన ప్రధాన ఎంట్రెన్స్‌ల్లో ‘ద మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్’(మ్యాట్) ఒకటి. ఈ ఎంట్రెన్స్‌ను 1988 నుంచి నిర్వహిస్తున్నారు.
‘ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ - 2026’ నోటిఫికేషన్‌ను ఢిల్లీలోని ‘ద నేషనల్ లా యూనివర్సిటీ’ విడుదల చేసింది. ఐదు సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ లా(బీఏ ఎల్‌ఎల్‌బీ)(ఆనర్స్), ఒక సంవత్సరం మాస్టర్ ఆఫ్ లా(ఎల్‌ఎల్‌ఎం) ప్రోగ్రామ్‌లకు సంబంధించిన ఈ ఎంట్రెన్స్ పరీక్ష 2025 డిసెంబర్ 14న జరుగుతుంది.
జర్నలిజం కేవలం ఒక వృత్తికాదు, ఇది ఒక సామాజిక కర్తవ్యం. మీరు నిజాయితీ, ధైర్యంతో సమాజంలో ఉన్న అన్యాయాలను ఓ జర్నలిస్టుగా వెలికితీయాలని అనుకుంటున్నారా?. అయితే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకో సువర్ణావకాశం కల్పిస్తోంది. ఆంధ్రజ్యోతి జర్నలిజం కాలేజీలో ట్రైనీ జర్నలిస్ట్‌గా చేరేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
India census: జనగణన ప్రక్రియకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. 2027 మార్చి 1వ తేదీ నాటికి రెండు దశల్లో జన, కుల గణన ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు.
తిరువూరు నగర పంచాయతీ, మాచర్ల మున్సిపాలిటీ మరియు నిడదవోలు వైస్ చైర్‌పర్సన్ పదవుల ఖాళీల భర్తీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 2న ఎన్నికల ప్రత్యేక సమావేశం జరగనుంది.
తెలంగాణ ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎస్సీ వర్గీకరణ పూర్తితో నియామకాలకు మార్గం సుగమమైంది; నిరుద్యోగులకు ఇది మంచి అవకాశమని మంత్రి ప్రకటించారు
అమరావతి: ఏపీలో ఐదు ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల అయింది. నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ఇప్పటికే షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
Election Notification: తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ల్గొండ - ఖమ్మం - వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 3 నుంచి 10 వరకు నోటిఫికేషన్లను స్వీకరించనుండగా.. 11న పరిశీలించనున్నారు.
గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలు డీసీసీబీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ అయ్యింది. వివరాలను ఆప్కాబ్ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది.