Share News

Municipal Elections: ఖాళీ అయిన మున్సిపల్‌ పదవుల భర్తీకి నోటిఫికేషన్లు

ABN , Publish Date - May 27 , 2025 | 05:21 AM

తిరువూరు నగర పంచాయతీ, మాచర్ల మున్సిపాలిటీ మరియు నిడదవోలు వైస్ చైర్‌పర్సన్ పదవుల ఖాళీల భర్తీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 2న ఎన్నికల ప్రత్యేక సమావేశం జరగనుంది.

Municipal Elections: ఖాళీ అయిన మున్సిపల్‌ పదవుల భర్తీకి నోటిఫికేషన్లు

అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): ఖాళీగా ఉన్న తిరువూరు నగర పంచాయతీ చైర్‌పర్సన్‌, మాచర్ల మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌, నిడదవోలు వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సోమవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ ఎన్నికల కోసం జూన్‌ 2వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని, ఆ మేరకు ఆయా మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ నెల 29లోపు జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారుల ద్వారా నోటీసులు జారీ చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలిచ్చింది.

Updated Date - May 27 , 2025 | 05:27 AM