Notification: ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
ABN , Publish Date - Mar 03 , 2025 | 12:03 PM
అమరావతి: ఏపీలో ఐదు ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల అయింది. నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ఇప్పటికే షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

అమరావతి: ఏపీ (AP)లో ఐదు ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ స్థానాలకు (MLC Seats) సోమవారం నోటిఫికేషన్ విడుదల (Notification Release) అయింది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ దాఖలకు అవకాశముంటుంది. 11న నామినేషన్ల పరిశీలన, 13 నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 20న పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. జంగాకృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబు..యనమల రామకృష్ణుడుల పదవి కాలం ఈ నెల 29 తో ముగియనుంది. దీంతో ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సాధారణ పరిపాలనా శాఖ సీఈఓ వివేక్ యాదవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
Read More..: మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై రఘురామ స్పందన..
ఎన్నికల కోడ్ అమలు...
నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ఇప్పటికే షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఖాళీ అయిన ఐదు స్థానాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు, పిఠాపురంలో సీటు త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తున్నట్లుగా సమాచారం. ఇక మిగిలిన మూడు స్థానాలకు వివిధ సామాజిక వర్గాల నుంచి పోటీ కనిపిస్తోంది. ఎవరిని ఎంపిక చేయాలన్నది కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు వైఎస్సార్‌సీపీకి సంఖ్యాబలం లేని కారణంగా ఒక్క స్థానం కూడా దక్కే అవకాశాలు లేవు.
కాగా ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా అసెంబ్లీ డిప్యూటి సెక్రటరీ ఆర్ వనితా రాణిని ఎన్నికల కమిషన్ నియమించింది. మరో ఇద్దరు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను కూడా నియామించింది. సోమవారం నుంచే ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారని సాధారణ పరిపాలనా శాఖ సీఈఓ వివేక్ యాదవ్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాదులో మేధాపాట్కర్.. అడ్డుకున్న పోలీసులు..
జీఎంసీ బాలయోగికి మంత్రి లోకేష్ నివాళి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News