JIo Airtel New Plans : జియో లేదా ఎయిర్‌టెల్ సిమ్ ఉన్నవారికి బంపర్ ఆఫర్..
ABN , Publish Date - Jan 27 , 2025 | 01:50 PM
ఇటీవల మొబైల్ రీఛార్జీ ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో వినియోగదారులు ఆందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలో డేటా లేకుండానే తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్లు రూపొందించాలని ట్రాయ్ అన్ని టెలికాం సంస్థలను ఆదేశించింది. ట్రాయ్ సూచనల మేరకు జియో, ఎయిర్‌టెల్‌లు తమ కస్టమర్ల కోసం డేటా లేకుండానే సరసమైన ధరలకు వాయిస్- ఓన్లీ ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి. అవేంటంటే..

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌లు భారతదేశంలోని రెండు ప్రముఖ టెలికాం కంపెనీలు, జియోకు సుమారు 490 మిలియన్ల వినియోగదారులు ఉంటే, ఎయిర్‌టెల్ 380 మిలియన్ల కస్టమర్లు ఉన్నారు. రెండు కంపెనీలు తమ వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందించడానికి నిరంతరం పోటీపడుతుంటాయి. ఇటీవల, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) డేటా లేకుండా సరసమైన ప్లాన్‌లను ప్రవేశపెట్టాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. ట్రాయ్ సూచనలను అనుసరించి జియో, ఎయిర్‌టెల్ తమ కస్టమర్ల కోసం కొత్త వాయిస్- ఓన్లీ ప్లాన్లు ప్రకటించింది. అవేంటో తెలుసుకుందాం..
జియో లేదా ఎయిర్‌టెల్ సిమ్ కార్డ్‌ల వినియోగదారులకు గుడ్ న్యూస్. ఈ రెండు దిగ్గజ టెలికాం కంపెనీలు తమ కస్టమర్ల కోసం డేటా లేకుండా రెండు చవకైన రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి. మొబైల్ రీఛార్జ్ ధరలు పెరిగాయని ఆందోళన చెందుతున్న చందాదారులకు ఊరట కలిగించే వార్తను ప్రకటించాయి. 365 డేస్ కోసం చవక ధరలకే ప్లాన్లు తీసుకొచ్చాయి. ఈ దిగ్గజ టెలికాం సర్వీస్ సంస్థలు అందిస్తున్న లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్‌లను నిశితంగా పరిశీలిద్దాం.
జియో రూ. 1748 రీఛార్జ్ ప్లాన్..
TRAI మార్గదర్శకాలకు అనుగుణంగా జియో రూ. 1,748 ధరతో రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ప్రకారం 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ వ్యవధిలో కస్టమర్లు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ పొందిన కస్టమర్లు 11 నెలల పాటు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ జియో ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు 3,600 ఉచిత SMSలు చేసుకునే అవకాశం పొందవచ్చు. అంతేకాకుండా, జియో టీవీ, జియో క్లౌడ్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లతో పాటు OTT స్ట్రీమింగ్ కోసం జియో సినిమాకి ఉచిత యాక్సెస్ వంటి అదనపు ప్రయోజనాలు కస్టమర్లు పొందుతారు.
రూ. 448 రీఛార్జ్ ప్లాన్: రూ. 458 రీఛార్జ్ ప్లాన్ ఇప్పుడు రూ. 448కి తగ్గించారు. కొత్తగా సవరించిన ప్లాన్ 84 రోజుల చెల్లుబాటు అవుతుంది. అపరిమిత వాయిస్ కాల్స్, 1,000 SMSలను చేసుకోవచ్చు. అదనపు ప్రయోజనాలు జియో టీవీ, జియో సినిమా (ప్రీమియం కానివి) జియో క్లౌడ్‌కి యాక్సెస్ లభిస్తుంది. రోజుకు రూ.5.30తో ఈ ప్లాన్ ఎంజాయ్ చేయవచ్చు.
ఎయిర్‌టెల్ రూ. 1849 రీఛార్జ్ ప్లాన్..
మరోవైపు, ఎయిర్‌టెల్ బడ్జెట్-ఫ్రెండ్లీ ప్లాన్‌ను రూ. 1,849 వద్ద ప్రారంభించింది. ఇది కూడా TRAI సిఫార్సులకు అనుగుణంగా ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్ని స్థానిక, STD నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ సౌలభ్యం ఉంటుంది. జియో మాదిరిగానే ఎయిర్‌టెల్ 3,600 ఉచిత SMSలను అందిస్తుంది. కస్టమర్‌లు ఈ ప్లాన్‌తో కాంప్లిమెంటరీ హలో ట్యూన్‌లను సెట్ చేసుకోవచ్చు.
రూ. 469 రీఛార్జ్ ప్లాన్: రూ. 499 రీఛార్జ్ ప్లాన్ ఇప్పుడు రూ. 469లకే వస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటు అవుతుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, 900 SMSలు ఉన్నాయి. అదనంగా అపోలో 24/7 సర్కిల్ సభ్యత్వం, ఉచిత హలో ట్యూన్ అందుకోవచ్చు. రోజుకు రూ. 5.58 ధరతోనే ముందున్న ముందున్న ప్లాన్ ప్రయోజనాలు లభిస్తాయి.
వొడాఫోన్ ఐడియా(Vi) రూ. 1,460 రీఛార్జ్ ప్లాన్..
వొడాఫోన్ ఐడియా రూ. 1,460కి సింగిల్ వాయిస్ SMS-మాత్రమే అందిస్తుంది. ఈ ప్లాన్ 270 రోజుల చెల్లుబాటు అవుతుంది. అపరిమిత కాల్స్, 100 SMSలు చేసుకోవచ్చు. అదనంగా, మీరు ప్లాన్ పరిమితిని దాటితే లోకల్‌కి రూ. 1 , STD మెసేజ్‌లకు రూ. 1.5 ఛార్జ్ చేస్తారు.