Share News

Post Office Savings Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తే..10 ఏళ్లలో రూ.12 లక్షల రిటర్న్స్..!

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:55 PM

చిన్న మొత్తాలతో రిస్క్ లేకుండా పెద్ద మొత్తాలను అందించే సేవింగ్స్ స్కీం కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ ప్లా్న్. ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో ప్రతి నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే కేవలం పదేళ్లలోనే ఏకంగా రూ.12 లక్షలు సంపాదించవచ్చు.

Post Office Savings Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తే..10 ఏళ్లలో రూ.12 లక్షల రిటర్న్స్..!
Post Office RD Scheme 2025

నేటి కాలంలో SIPని పెట్టుబడికి మెరుగైన మార్గంగా పరిగణిస్తారు. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది ప్రజలు మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడరు. కాస్త తక్కువ లాభం వచ్చినా రిస్క్ లేకుండా కచ్చితమైన రిటర్న్స్ రావాలని కోరుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ పోస్ట్ ఆఫీస్ స్కీం. ప్రభుత్వ సంస్థ కావడంతో పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. అనుకున్న సమయానికి అనుకున్న సంపాదన చేతికొస్తుంది. మీరు కూడా మీరు కూడా అలాంటి పెట్టుబడిదారులలో ఒకరైతే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD)లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. ప్రతి నెలా స్థిర మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు.


పోస్ట్ ఆఫీస్ RD పథకానికి 5 సంవత్సరాల కాలవ్యవధి ఉంటుంది. ఈ స్కీం కింద పెట్టుబడిదారులకు 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. దీనిని త్రైమాసిక ప్రాతిపదికన లెక్కిస్తారు. ఈ విధంగా మంచి మొత్తాన్ని ఆదా చేయవచ్చు. పోస్ట్ ఆఫీస్ RDలో ప్రతి నెలా రూ.7000 పెట్టుబడి పెడితే.. 5 సంవత్సరాలలో రూ. 5 లక్షలు, 10 సంవత్సరాలలో దాదాపు రూ.12 లక్షలు ఆదా చేయవచ్చు.


12 లక్షలు ఎలా ఆదా చేయాలి?

మీరు ఈ RD స్కీంని మరో 5 సంవత్సరాలు పొడిగిస్తే దాదాపు 12 లక్షల రూపాయల ఆదాయం లభిస్తుంది. ఇందులో మీ మొత్తం పెట్టుబడి 8,40,000 అవుతుంది. దీనిపై 6.7 శాతం వడ్డీ రేటుతో వడ్డీగా రూ. 3,55,982 మాత్రమే లభిస్తుంది. మెచ్యూరిటీ పీరియడ్ పూర్తయ్యాక రూ. 11,95,982 అంటే దాదాపు 12 లక్షల రూపాయలు చేతికొస్తుంది.


పోస్ట్ ఆఫీస్ RD ప్రయోజనాలు

  • పోస్ట్ ఆఫీస్ RD ని రూ. 100 తో తెరవవచ్చు. ఇది ఎవరైనా సులభంగా ఆదా చేయగల మొత్తం. దీనిలో పెట్టుబడికి గరిష్ఠ పరిమితి లేదు. దీనిపై కాంపౌండ్ వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. 5 సంవత్సరాలలో వడ్డీగా మంచి లాభం పొందుతారు. ఈ పథకంలో ఒక వ్యక్తి ఎన్ని ఖాతాలనైనా తెరవవచ్చు. సింగిల్ కాకుండా ముగ్గురు వ్యక్తులకు ఉమ్మడి ఖాతా తెరవవచ్చు. పిల్లల పేరుతో ఖాతా తెరిచే సౌకర్యం కూడా ఉంది.

  • RD ఖాతా మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. కానీ 3 సంవత్సరాల తర్వాత ప్రీ-మెచ్యూర్ క్లోజర్ చేయవచ్చు. ఇందులో నామినేషన్ సౌకర్యం కూడా ఉంది. మెచ్యూరిటీ తర్వాత RD ఖాతాను మరో 5 సంవత్సరాలు కొనసాగించవచ్చు.


ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

త్వరలో UPI కొత్త ఫీచర్.. ఇకపై కంటిచూపుతోనే పేమెంట్స్..!

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 31 , 2025 | 01:33 PM