Share News

PC Ghosh Commission Report: కాళేశ్వరంపై నివేదికను అందజేసిన పి.సి ఘోష్..

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:32 PM

కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై విచారించిన పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నివేదికను షీల్డ్ కవర్‌లో ప్రభుత్వానికి అందజేశారు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్.

PC Ghosh Commission Report: కాళేశ్వరంపై నివేదికను అందజేసిన పి.సి ఘోష్..
Justice PC Ghosh Commission

హైదరాబాద్, జులై 31: కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై విచారించిన పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నివేదికను షీల్డ్ కవర్‌లో ప్రభుత్వానికి అందజేశారు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. బీఆర్‌కే భవన్‌కు వెళ్లి.. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదికను అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు, అవినీతిపై 15 నెలల పాటు విచారణ జరిపారు జస్టిస్ పీసీ ఘోష్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి పూర్తి విచారణ చేశారు. కమిషన్ అందించిన నివేదికను రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అందజేయనున్నారు రాహుల్ బొజ్జా. కమిషన్ తన నివేదికలో ఏం పేర్కొంది.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.


Also Read:

ఓవల్‌ టెస్ట్‌లో భారత్‌కు వరుణుడి శాపమా, వరమా?

జీపు కింద పడ్డ మొసలి.. చివరకు ఏం చేసిందో చూస్తే..

For More Telangana News and Telugu News..

Updated Date - Jul 31 , 2025 | 12:32 PM