Share News

Bill Gates: లేటు వయసులో ఘాటు ప్రేమ.. సీక్రెట్ రివీల్ చేసిన బిల్‌గేట్స్

ABN , Publish Date - Feb 06 , 2025 | 10:51 AM

Bill Gates Girlfriend: అపర కుబేరుడు బిల్ గేట్స్‌కు సంబంధించిన ఓ క్రేజీ సీక్రెట్ బయటపడింది. తన లవ్ లైఫ్ గురించి బిల్ గేట్స్ రివీల్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

Bill Gates: లేటు వయసులో ఘాటు ప్రేమ.. సీక్రెట్ రివీల్ చేసిన బిల్‌గేట్స్
Bill Gates

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, అపర కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ ఏం చేసినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అమెరికాతో పాటు అనేక ప్రపంచ దేశాల్లో ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారత్‌లోనూ బిల్ గేట్స్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఐటీ రంగంలో ఎదగాలని ప్రయత్నిస్తున్న వారు కోకొల్లలు. 69 ఏళ్ల వయసులోనూ యంగ్‌స్టర్స్‌తో పోటీపడుతూ వినూత్నమైన ఆలోచనలతో అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తుంటారాయన. అయితే పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు బిల్ గేట్స్. కొన్నేళ్ల కింద భార్యకు డివోర్స్ ఇచ్చిన ఆయన.. ఓ మహిళతో ప్రేమాయణం నడుపుతున్నట్లు న్యూస్ వచ్చింది. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు.


నా అదృష్టం

గర్ల్‌ఫ్రెండ్ పాలా హర్డ్‌ గురించి తొలిసారి స్పందించారు బిల్ గేట్స్. ఆమెనే తన సీరియస్ గర్ల్‌ఫ్రెండ్ అని రివీల్ చేశారు. ‘ఆమె లాంటి వ్యక్తి దొరకడం నిజంగా నా అదృష్టం. మేమిద్దరం కలసి టోర్నమెంట్స్‌కు వెళ్తుంటాం. మేం కలసి పనులు కూడా చేసుకుంటాం’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు బిల్ గేట్స్. కాగా, 1994లో మెలిందా ఫ్రెంచ్‌ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్. ఆమెతో 27 ఏళ్ల పాటు కలసి ఉన్నారు. అయితే అన్యోన్యంగా సాగిన వీరి దాంపత్యానికి 2021లో బ్రేక్ పడింది. ఆ ఏడాది వీళ్లు విడాకులు తీసుకున్నారు.


ఎవరీ పాలా హర్డ్?

మెలిందాతో డివోర్స్ తర్వాత ఒంటరిగా ఉంటున్న బిల్ గేట్స్.. పాలా హర్డ్‌తో ప్రేమలో పడ్డారని వినిపించింది. ఆమెతో చాన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నారని పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. ఒరాకిల్ సంస్థ సీఈవో మార్క్ హర్డ్ సతీమణి అయిన పాలా హర్డ్‌కు ఇప్పుడు 62 ఏళ్లు. భర్త మార్క్ హర్డ్ 2019లో చనిపోవడంతో అప్పటి నుంచి ఇద్దరు కుమార్తెలను చూసుకుంటూనే జీవిస్తున్నారు. ఆమె బిల్ గేట్స్‌తో ప్రేమలో పడ్డట్లు వార్తలు వచ్చాయి. 2023 జనవరి నెలలో వీళ్లిద్దరూ కలసి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో జంటగా సందడి చేయడంతో వీళ్లు రిలేషన్‌లో ఉన్నారనే రూమర్స్ మరింత పెరిగాయి. ఆమే తన సీరియస్ గర్ల్‌ఫ్రెండ్ అని ఎట్టకేలకు బిల్ గేట్స్ కన్ఫర్మ్ చేయడంతో ఆ వార్తలకు ఇప్పుడు ఫుల్‌స్టాప్ పడింది.


ఇవీ చదవండి:

సౌందర్య ఉత్పత్తుల మార్కెట్లోకి అనన్య బిర్లా

నారాయణమూర్తికి గౌరవ డాక్టరేట్‌

రుణం కంటే ఎక్కువ వసూలు చేశారు

మరిన్ని వ్యాపార, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 06 , 2025 | 11:22 AM