HHVM: సీఎం చంద్రబాబు, నారా లోకేష్ కు థ్యాంక్స్: పవన్ కళ్యాణ్
ABN , Publish Date - Jul 23 , 2025 | 09:08 PM
మూడేళ్ల క్రితం విశాఖలోని నోవోటల్‌లో నన్ను నిర్బంధిస్తే నా కోసం విశాఖ మొత్తం హోటల్ దగ్గరకు వచ్చింది.. నాకు ఇవ్వడమే తెలుసు.. అడగడం తెలియదన్న పవన్ కళ్యాణ్.. నిలబడే శక్తి నాకు సినిమా ఇచ్చిందన్నారు.

విశాఖ పట్నం, జులై23: 'హరిహర విరమల్లు' సినిమా వైజాగ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. విశాఖపట్నం నా గుండెల్లో ఉంటుందని చెప్పిన పవన్.. ఉత్తరాంధ్ర ఆట పాట అణువణువునా నేర్చుకున్నానని చెప్పారు. 'ఈ ధైర్యాన్ని.. నటన ద్వారా ఇచ్చింది.. మా గురువు సత్యానంద్ గారు. ఆయన ద్వారానే విశాఖన్నా.. ఉత్తరాంధ్రన్నా మా అభిమానాలు ఎక్కువగా ఇష్టపడతారు. మూడేళ్ల క్రితం విశాఖలోని నోవోటల్ లో నన్ను నిర్బంధిస్తే, నాకోసం విశాఖ మొత్తం హోటల్ దగ్గరకు వచ్చింది. విశాఖ నాకు బలమైన జ్ఞాపకాలను ఇచ్చింది. గత ప్రభుత్వంలో నా సినిమాలకు టికెట్ రేట్లు పెంచడానికి అవకాశం ఇవ్వలేదు. సీఎం చంద్రబాబు అందరి హీరోలకు చేసినట్లు గానే నా సినిమాకు టికెట్ రేట్లు పెంచడానికి అవకాశం ఇచ్చారు. నా సినిమా టికెట్ రేట్లు పెంచుకొనే అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు గారికి కృతజ్ఞతలు. నా సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ట్వీట్ చేసిన యువ నాయకులు లోకేష్ కు కృతజ్ఞతలు.' అని పవన్ అన్నారు.
నాకు ఇవ్వడమే తెలుసు.. అడగడం తెలియదన్న పవన్ కళ్యాణ్.. 'నేను తీసుకున్న శాఖలకు ఇబ్బంది లేకుండా సినిమాలు చేసాను. రాష్ట్రంలో నియతృత్వ పోకడలు ఉన్న ప్రభుత్వాన్ని ఎదుర్కొని నిలబడే శక్తి నాకు సినిమా ఇచ్చింది. సినిమాకు కులం, మతం ఉండదు. సనాథనాధర్మం మతాలకు వ్యతిరేకం కాదు. విశాఖ వేదికగా హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.' అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
పాపులర్ సీఎం ఫేస్ తేజస్వి, వెనుకబడిన నితీష్.. సర్వే వెల్లడి
అల్‌ఖైదా కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్రవాదుల అరెస్టు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి