Share News

TDP MP Sri Bharat: అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ శ్రీభరత్ ఫైర్

ABN , Publish Date - Aug 02 , 2025 | 04:50 PM

గుడివాడ అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారని తెలుగుదేశం విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ ధ్వజమెత్తారు. అమర్నాథ్ లాగా తాము దిగజారి మాట్లాడమని పేర్కొన్నారు. దిగజారి మాట్లాడేవాళ్లను జగన్ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కేవలం కుల సమీకరణాల కోసమే గత వైసీపీ ప్రభుత్వం డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులను ఇచ్చిందని ఆక్షేపించారు.

TDP MP Sri Bharat: అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ  శ్రీభరత్ ఫైర్
TDP MP Sri Bharat

విశాఖపట్నం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, తమను విడదీసేలా వైసీపీ నేతలు (YSRCP Leaders) కుయుక్తులు పన్నుతున్నారని తెలుగుదేశం విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ (TDP MP Sri Bharat) ఆరోపించారు. బాలకృష్ణకు, మెగా ఫ్యామిలీకి మధ్య వైరుధ్యం ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(శనివారం) విశాఖపట్నం వేదికగా ఏబీఎన్‌తో ఎంపీ శ్రీభరత్ మాట్లాడారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాటల వల్లే 95 వేల ఓట్లతో ఓడిపోయారని విమర్శించారు ఎంపీ శ్రీభరత్.


అమర్నాథ్ ఆరోపణలపై స్పందించాలంటే తనకు అవమానంగా ఉంటుందని ఎంపీ శ్రీభరత్ చెప్పుకొచ్చారు. డిగ్నిటీ లేకుండా మాట్లాడితే తాము సమాధానం ఇవ్వలేమని తెలిపారు. గుడివాడ అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అమర్నాథ్ లాగా తాము దిగజారి మాట్లాడమని పేర్కొన్నారు. దిగజారి మాట్లాడే వాళ్లను జగన్ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కేవలం కుల సమీకరణాల కోసమే గత వైసీపీ ప్రభుత్వం డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులను ఇచ్చిందని ఆక్షేపించారు. గతంలో పదవులను ఇచ్చారు తప్పా అధికారాలను జగన్ ఇవ్వలేదని విమర్శించారు. సింగపూర్‌తో చంద్రబాబుకు ఉన్న గత పరిచయాల వల్ల ఏపీలో పెట్టుబడులు వస్తున్నాయని ఉద్గాటించారు. ఏపీ ప్రజలకు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్వేచ్ఛ దొరికిందని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఈ రోజు నాకెంతో స్పెషల్: మంత్రి నారా లోకేష్

గత పాలన సైకో పాలన.. ఆర్థిక విధ్వంసం చేసి అందరినీ ఇబ్బంది పెట్టారు

Read Latest AP News and National News

Updated Date - Aug 02 , 2025 | 04:56 PM