Drug Case: విశాఖలో డ్రగ్స్ కలకలం.. అడ్డంగా దొరికిన వైసీపీ డ్రగ్స్ దొంగలు
ABN , Publish Date - Nov 02 , 2025 | 05:33 PM
విశాఖపట్నంలో ఈగల్ టీం, సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారం రావడంతో వెంటనే రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టారు.
విశాఖపట్నం, నవంబరు2 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం (Visakhapatnam)లో ఈగల్ టీం (Eagle Team), సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు (City Task Force Police) ఇవాళ (ఆదివారం) తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారం రావడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో డ్రగ్స్ తరలిస్తున్న చరణ్ అనే యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. యువకుడి దగ్గరి నుంచి 36 ఎల్ఎస్‌డీ బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు.
యువకుడు చరణ్‌ని పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో విశాఖపట్నంలో కొంతమంది ప్రముఖుల కోసం ఈ డ్రగ్స్ తీసుకువచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే పట్టుబడ్డ యువకుడు ఇచ్చిన సమాచారంతో వైసీపీ (YSRCP) స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కొండారెడ్డి (Konda Reddy)ని అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం. యువకుడు చరణ్‌ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
కొండారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది రాజకీయ నేతలపై కూడా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే, పట్టుబడిన యువకుడు చరణ్ బెంగళూరు నుంచి విశాఖపట్నానికి డ్రగ్స్ తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీలో డ్రగ్స్ దందాని పూర్తిగా అరికడతామని పేర్కొన్నారు. డ్రగ్స్‌పై ఎలాంటి సమాచారం తెలిసినా తమకు వెంటనే తెలియజేయాలని ఈగల్ టీం, విశాఖపట్నం టాస్క్‌ఫోర్స్ పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో దారుణం.. మహిళపై ర్యాపిడో డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రమాదం.. అయ్యప్ప స్వాములకి తీవ్రగాయాలు
Read Latest AP News And Telugu News