Panchumarthi Anuradha: వైసీపీ పేటీఎం బ్యాచ్.. మూల్యం చెల్లించుకోక తప్పదు..
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:01 PM
సోషల్ మీడియాలో టీడీపీ నేతలపై ముఖ్యంగా లోకేశ్, జనసేన అధినేత పవన్‌లపై వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతూ.. విమర్శలు చేశారు. ప్రత్యర్థి పార్టీల నాయకులపై వ్యక్తిగత విమర్శలు సైతం చేశారు.
అమరావతి: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్న పేటీఎం బ్యాచ్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ హెచ్చరించారు. తల్లి, చెల్లిని కూడా వదలకుండా వ్యక్తిత్వ హననం చేయించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అని విమర్శించారు. కల్తీమద్యంతో 30 వేల మంది ప్రాణాలు తీసి ఎందరో తల్లులకు గుండెకోత మిగిల్చారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించి వారిని జైలుకు పంపుతూ.. తల్లిదండ్రులకు ఆవేదన మిగుల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిల్లలతో జగన్ చేయిస్తున్న వికృత చేష్టల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అనురాధ సూచించారు. భాస్కర్ రెడ్డి లాంటి చెంచాలను జగన్ ఎందరిని ప్రయోగించినా.. వారంతా కటకటాల వెనక్కి వెళ్లక తప్పదని తెలిపారు. పనికిమాలిన పేటీఎం బ్యాచ్‌తో ఇంకెంత కాలం విషప్రచారం సాగిస్తారు అని ప్రశ్నించారు. తలా తోక లేకుండా అర్థం లేని వ్యాఖ్యలతో మహిళల్ని కించపరిచే మీరు అసలు మనుషులేనా అని నిలదీశారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదా అని ఆక్షేపించారు.
గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో సోషల్ మీడియాకు వైసీపీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. సోషల్ మీడియాలో టీడీపీ నేతలపై ముఖ్యంగా లోకేశ్, జనసేన అధినేత పవన్‌లపై వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతూ.. విమర్శలు చేశారు. నాయకులపై వ్యక్తిగత విమర్శలు సైతం చేశారు. అయితే 2024 ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో వైసీపీ ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా సొంతం చేసుకోలేక పోయింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారిపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
షుగర్ వ్యాధి ఉంటే ఇక వీసా రానట్టే.. అమెరికా నిబంధనలు మరింత కఠినతరం
హెబ్-1బీ వీసా.. లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తుల పరిశీలన ప్రారంభం