Maha Surya Vandanam: గిన్నిస్ బుక్ రికార్డు దిశగా మహా సూర్య వందనం
ABN , Publish Date - Apr 07 , 2025 | 06:13 PM
Maha Surya Vandanam: మహా సూర్య వందనం గిన్నిస్ బుక్ రికార్డు సాధించాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అసాధ్యమన్న పనిని గిరిజన విద్యార్థులు సుసాధ్యం చేస్తున్నారని తెలిపారు.

అల్లూరి జిల్లా: అరకు డిగ్రీ కళాశాల వేదికగా ఇవాళ(సోమవారం) మహా సూర్య వందనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 20 వేల మంది విద్యార్థులు 108 సార్లు సూర్య నమస్కారాలు చేశారు. 13000 వేల మంది ఆడపిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాన్ని పరిశీలించి వరల్డ్ రికార్డ్ యూనియన్ సంస్థ సర్టిఫై చేయనుంది.
సూర్య నమస్కారాల కార్యక్రమంలో పాడేరు డివిజన్‌లోని 60 ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. గత ఐదు నెలల నుంచి విద్యార్థులు సూర్య నమస్కారాల కోసం శిక్షణ తీసుకున్నారు. 200 మంది వ్యాయామ ఉపాధ్యాయులు సూర్య నమస్కారాలను పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడారు.
సూర్య నమస్కారాలు 108 సార్లు చేస్తారంటే ఆశ్చర్యం అనిపిస్తోందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. అసాధ్యమన్న పనిని గిరిజన విద్యార్థులు సుసాధ్యం చేస్తున్నారని తెలిపారు. 108 సార్లు ఆసనాలు వేయాలంటే ఎంతో ఓపిక కావాలని చెప్పారు. ఆసనాలతో క్రమశిక్షణ, ఓపిక చదువుపై శ్రద్ధ పెరుగుతుందని అన్నారు. మహా సూర్య వందనం గిన్నిస్ బుక్ రికార్డు సాధించాలని తెలిపారు. ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న అల్లూరి జిల్లా యంత్రాంగానికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Mega Health Hub: ఆరోగ్య రంగంలో సంస్కరణలు.. చంద్రబాబు విజన్ ఇదే
Pawan Visit Alluri District: అప్పుడు చెప్పా.. ఇప్పుడు సాకారం
Prabhavati Investigation: విచారణకు వచ్చిన ప్రభావతి.. కానీ
YS Sharmila Criticizes AP Govt: నిలిచిన వైద్య సేవలు.. సర్కార్‌పై షర్మిల ఫైర్
Read Latest AP News And Telugu News