Home Minister Anitha: పవన్ మాటలు చాలా ప్రోత్సాహాన్నిచ్చాయి
ABN , Publish Date - May 01 , 2025 | 08:21 AM
Home Minister Anitha: సింహాచల ప్రమాద ఘటనలో హోంమంత్రి అనిత చేపట్టిన సహాయక చర్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఈ సమయంలో హోంమంత్రి అనిత సేవలు చాలా బాగున్నాయని కొనియాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు హోంమంత్రి అనిత కృతజ్ఞతలు తెలిపారు.

అమరావతి: సింహాచలం లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సింహాచలం ఆలయంలో జరిగిన తీవ్ర విషాద ఘటనపై వెంటనే స్పందించి సకాలంలో ఏపీ హోంమంత్రి అనిత చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సింహాచలంలో హోంమంత్రి అనిత చేసిన సేవలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత కృతజ్ఞతలు తెలిపారు. ‘అన్నా , మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ మాటలు నాకు చాలా ప్రోత్సాహాన్నిస్తున్నాయి. మీరు చెప్పినట్టే, కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి వెంటనే చర్యలు చేపట్టాం. సంక్షోభాల సమయంలో మన ప్రియతమ నాయకుడు సీఎం చంద్రబాబు చూపిన నాయకత్వం మాకు ప్రేరణగా నిలిచింది. బాధిత కుటుంబాలకు అండగా ఉండటంలో, భక్తుల్లో ధైర్యాన్ని నూరిపోసే విషయంలో ఉన్నతాధికారులు, సిబ్బంది అద్భుతమైన సమన్వయంతో పనిచేశారు. వారికి నా అభినందనలు’ అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
కాగా.. సింహాచలం లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ ఒక్కసారిగా వచ్చిన గాలితో కూడిన వర్షంతో నాలుగురోజుల క్రితం నిర్మించిన రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఈ రిటైనింగ్ వాల్ 300 దర్శనానికి వెళ్లే క్యూలైన్ పక్కనే ఉంది. ఆకస్మాత్తుగా వచ్చిన గాలి వర్షంతో క్యూలైనులో ఉండే భక్తులు ఎనిమిది మంది మృత్యవాత పడ్డారు. పలువురు భక్తులకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి అనిత అప్రమత్తం అయ్యారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ క్రమంలో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు మంత్రి అనితకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసు, వైద్యాధికారులను మంత్రి అనిత అలర్ట్ చేశారు. అప్పన్న స్వామి చందనోత్సవం వేళ అనుకోని ప్రమాదం జరగడంతో.. పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu: నెల్లూరు జిల్లా పర్యటనకు..
పహల్గాం దాడిని ఖండించిన ఐక్యరాజ్య సమితి
ప్రభుత్వ వెంచర్లో కొంటే రిజిస్ట్రేషన్ ఖర్చు తక్కువ
For More AP News and Telugu News