YSRCP: రియల్ మోసం.. వైసీపీ నేత కుమారుడి అరెస్ట్
ABN , Publish Date - Jun 24 , 2025 | 09:46 AM
YSRCP: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాదాపు 200 మంది బాధితులను లక్ష్మీ విజయ్ కుమార్ మోసం చేసినట్లు తెలుస్తోంది. వెయ్యి కోట్లు టర్నోవర్ ఉన్న పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అంటూ జోరుగా ప్రచారం చేశాడు.

ప్రకాశం, జూన్ 24: రియల్ ఎస్టేట్ (Real Estate) పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన విజయవాడ వైసీపీ నేత, మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు కుమారుడు లక్ష్మీ విజయ్ కుమార్‌ను (Vijay Kumar) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ స్కీంల పేరుతో చీటింగ్‌కు పాల్పడ్డాడు విజయ్. ఏపీ ఇన్ ఫ్రాకన్ పేరుతో 22 రకాల ప్రాజెక్టుల పేర్లు చెప్పి కోట్ల రూపాయలు వరకు ప్రజల నుంచి వసూలు చేశాడు. అయితే పెట్టుబడి పెట్టిన వారికి ప్లాట్లు ఇవ్వకుండా మోసానికి పాల్పడ్డాడు. కాలం గడుస్తున్నప్పటికీ తమకు ప్లాట్లు రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు ఒంగోలులో లక్ష్మీ విజయ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాదాపు 200 మంది బాధితులను లక్ష్మీ విజయ్ కుమార్ మోసం చేసినట్లు తెలుస్తోంది. వెయ్యి కోట్లు టర్నోవర్ ఉన్న పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అంటూ జోరుగా ప్రచారం చేశాడు. ఎత్తైన భవనాలు, ఆకర్షణీయ వెంచర్లను చూపి ప్రజలను ఆకర్షించే ప్రకటనలు చేశాడు. పథకాల పేరుతో దగా చేసిన వైనం బయటపడింది. అమ్మకాలు అద్భుతంగా ఉన్నాయంటూ మోసం చేసి ప్రజల నుంచి కోట్లలో వసూలు చేశాడు. విజయ్ కుమార్‌ను నమ్మి అద్భుతమైన ప్లాట్లు సొంతమవుతాయని భావించిన బాధితులు తమ దగ్గర ఉన్నదంతా పెట్టుబడిగా పెట్టేశారు. అయితే ఎన్ని రోజులైనా విజయ్ కుమార్ ప్లాట్లు ఇవ్వకపోవడంతో అతడిని నిలదీశారు.
కానీ.. అడిగిన వారిని వాట్సప్ గ్రూపుల్లో తొలగించి, కార్యాలయానికి రాకుండా ఆంక్షలు విధించాడు విజయ్. స్కీమ్-1లో రూ.2 నెలవారి వడ్డీ, స్కీమ్-3లో రూ.3 వడ్డీ మూడు నెలలకు ఒకసారి చెల్లింపులు అంటూ చేతులెత్తేశాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ప్రభుత్వం కూడా స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి లక్ష్మీ విజయ్‌ను అరెస్ట్ చేసేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కేసు నమోదు అవడంతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు విజయ్. కానీ చివరకు ఒంగోలులో విజయ్ కుమార్‌ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
ఏపీలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు అమోదం..
ఏరో స్పేస్ డిఫెన్స్‌లో లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం
మూడు రోజుల పాటు నగరంలో వర్షాలు
Read Latest AP News And Telugu News