అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్నంగా నిర్వహించిన పొలంబాట కార్యక్రమం సత్ఫలితాన్నిచ్చింది. ఆరంభంలో ఆశ్చర్యశకితులైన ప్రజలు అంతలోనే అర్థం చేసుకుని బెరుకు లేకుండా సీఎంకు సమస్యలు వివరించుకోగలిగారు. అభిమానులు, పార్టీశ్రేణులు ఆయన దగ్గరకు వెళ్లి కరచాలనం చేయగలిగారు.
సీఎం చంద్రబాబు పర్యటన శనివారం జోరుగా హుషారుగా సాగింది. గతానికి భిన్నంగా దర్శిలో ప్రత్యేక స్టయిల్‌లో కొనసాగింది. పచ్చని పొలాల్లో మాగాణి కయ్యలు, నారుమళ్ల మధ్య రైతులతో ముఖాముఖి నిర్వహించారు.
రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి అనువైన పంటల ద్వారా లాభాల బాటలో నడిచే విధంగా చైతన్యవంతులను చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దర్శి మండలం తూర్పువీరాయపాలెం గ్రామం వద్ద పచ్చని పొలాల్లో శనివారం ఆయన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. గ
సూపర్ సిక్స్‌లో భాగమైన అన్నదాత సుఖీభవ పథకం శనివారం ప్రారంభమైంది. ఏడాదికి అర్హులైన ఒక్కో రైతు కుంటుంబానికి రూ.20వేల వంతున నగదును ఈ పథకం ద్వారా అందిస్తుండగా అందులో పీఎం కిసాన్ పథకం నుంచి కేంద్రం రూ.6వేలు, మిగిలిన రూ.14వేలను రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న విషయం విదితమే.
జిల్లాలో ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు విషయంలో భారీ మొత్తాలు చేతులు మారుతున్నాయి. అధికారులు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ యాజమాన్యాలను పీక్కుతింటున్నారు. తాజాగా ఆరు స్కూళ్లకు ప్రభుత్వ గుర్తింపు విషయంలో అధికారుల తీరుపై యాజమాన్యాలు నేరుగా పాఠశాల విద్య కమిషనర్ రామరాజుకు ఫిర్యాదు చేయడంతో విషయం రచ్చకెక్కింది.
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో రాష్ట్రశాఖ పిలుపు మేరకు జిల్లాశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ఫ్యాప్టో జిల్లా చైర్మన్ కె.ఎర్రయ్య అధ్యక్షత వహించారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించకపోతే ఉద్యమన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని నాయకులు హెచ్చరించారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. శనివారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో అన్నదాత సుఖీభవ పథకం కింద మంజూ రైన రూ.28.74 కోట్ల చెక్కును ఎమ్మెల్యే రైతులకు అందజేశారు.
దర్శి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు హమీ ఇచ్చినట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు.
అన్నదాతకు అన్నివిధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి భరోసా ఇచ్చారు. మండంలంలోని నికరంపల్లి, భూపతిపల్లి గ్రామాలలో శనివారం అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రజలు సైకో పాలన చూశారని, గత పాలకులు పెన్షన్లు ఇవ్వకుండా ఎగ్గొట్టి, ఆర్థిక విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.