Home » Prakasam
గిద్దలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి మృతి చెందారు. కొద్ది రోజులుగా వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు.
జిల్లాలో సాగర్ నీటి పంపిణీ ఈసారి గందరగోళంగా మారింది. సాగర్ డ్యామ్ నుంచి కుడి కాలువకు పదివేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా అవి బుగ్గవాగుకు చేరుతున్నాయి. అక్కడి నుంచి 8,845 క్యూసెక్కులు ప్రధాన కాలువకు సరఫరా చేస్తున్నారు.
సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆపదలో ఉన్నాడని పాపం తలచి ఫోన్ ఇస్తే అకౌంట్లలోని నగదును కాజేసే వినూత్న సైబర్ నేరాలకు పాల్పడేవారు తారసపడుతున్నారు. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారు కీప్యాడ్ ఫోన్లు వాడుతుంటారు.
జిల్లాలో స్క్రబ్ టైఫస్ ప్రబలుతోంది. దానిబారినపడి ఎర్రగొండపాలెంకు చెందిన పి.దానమ్మ (61) గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందారు.
దిత్వా తుపాన్ భారత్‌వైపునకు దూసుకొస్తోంది. ఆదివారం తెల్లవారుజాము నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో మత్స్యకారులు, రైతులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.
వధువు వరుడిలా.. వరుడు వధువులా ముస్తాబై అందరినీ ఆకర్షించారు. ఈ వింత సంప్రదాయం ప్రకాశం జిల్లాలో జరిగింది.
మెంథా తుఫానులో సమర్థవంతంగా పనిచేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమష్టిగా పనిచేశారని ప్రశంసించారు. మెంథా తుఫాను నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు చేపట్టామని నొక్కిచెప్పారు.
ప్రతిపక్ష నేత అర్హత కూడా జగన్ సంపాదించుకోలేక పోయారని మంత్రి ఆనం వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పని చేయకపోతే జగన్ అసెంబ్లీకి వచ్చి చర్చించాలని అన్నారు.
కృష్ణా నదిలో ఎగువ నుంచి కొట్టుకుని వస్తున్న బోటును జాలర్లు గుర్తించి విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు డ్రోన్లతో తుమ్మలపాలెం వద్ద బోటుని గుర్తించారు.
భారీ వర్షాల కారణంగా చీరాల నుంచి పాకాల వరకు ఉన్న లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. చీరాలలో చేనేత మగ్గాలు కూడా నీట మునిగిపోయాయి. రబీ సీజన్‌లో వేసిన పంటలు పూర్తిగా నీట మునిగిపోయాయి.