వింత సంప్రదాయం.. వధువు వరుడిలా.. వరుడు వధువులా ముస్తాబు
ABN, Publish Date - Nov 28 , 2025 | 11:30 AM
వధువు వరుడిలా.. వరుడు వధువులా ముస్తాబై అందరినీ ఆకర్షించారు. ఈ వింత సంప్రదాయం ప్రకాశం జిల్లాలో జరిగింది.
ప్రకాశం, నవంబర్ 28: జిల్లాలోని ఎర్రగుండపాలెంలోని కొలుకులలో ఓ పెళ్లి వేడుక అందరినీ ఆకట్టుకుంది. వధువు వరుడిలా.. వరుడు వధువులా ముస్తాబై అందరినీ ఆకర్షించారు. బత్తుల కుటుంబానికి చెందిన శివగంగ రాజు, నందిని కుటుంబంలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. వరుడు వధువులా.. వధువు వరుడులా అలంకరించుకోవడం తప్పని సరి. వధువు నందిని వరుడిలా తెల్ల పంచె, కుర్తాతో కనిపించగా.. వరుడు శివగంగ రాజు పట్టు చీర, ఆభరణాలతో సంప్రదాయ వధువు వేషధారణలో కనిపించాడు.
ఈ ఆచారాన్ని తమ కుటుంబం ఎన్నో ఏళ్లుగా పాటిస్తోందని.. ఇలా చేస్తే కొత్త జంటకు శుభం జరుగుతుందని తాము నమ్ముతామని కుటుంబసభ్యులు చెబుతున్నారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు గ్రామంలో ఊరేగింపుగా వెళ్లి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఇవి కూడా చదవండి...
అంబర్‌పేట్ ఎస్‌ఐ గన్ మిస్సింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
విలీనం తర్వాతే విభజన.. ప్రభుత్వ విభాగాల కసరత్తు
Read Latest AP News And Telugu News
Updated at - Nov 28 , 2025 | 11:38 AM