Major Mishap Averted: ప్రకాశం బ్యారేజ్‌కి తప్పిన పెను ప్రమాదం.. పడవను గుర్తించి ఒడ్డుకు చేర్చిన అధికారులు..
ABN , Publish Date - Oct 30 , 2025 | 09:37 PM
కృష్ణా నదిలో ఎగువ నుంచి కొట్టుకుని వస్తున్న బోటును జాలర్లు గుర్తించి విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు డ్రోన్లతో తుమ్మలపాలెం వద్ద బోటుని గుర్తించారు.
ప్రకాశం బ్యారేజ్‌కి పెను ప్రమాదం తప్పింది. కృష్ణా నదిలో కొట్టుకు వస్తున్న పడవను ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెంలో స్థానిక జాలర్లు అడ్డుకున్నారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సహకారంతో దాన్ని ఒడ్డుకు చేర్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కృష్ణా నదిలో ఎగువ నుంచి కొట్టుకుని వస్తున్న బోటును జాలర్లు గుర్తించి విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు డ్రోన్లతో తుమ్మలపాలెం వద్ద బోటుని గుర్తించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గజ ఈతగాళ్ల సహాయంతో బోటును ఒడ్డుకు చేర్చారు.
సంగం బ్యారేజ్ విషయంలోనూ..
నెల్లూరు జిల్లా, సంగం బ్యారేజ్ వద్దకు లంగరు తెగిపోయిన 30 టన్నుల బరువు ఉండే ఇసుక బోటు గేట్ల వరకు వచ్చింది. ఆ భారీ బోటు బ్యారేజ్ గేట్లకు తగిలి ఉంటే భారీ డ్యామేజీ జరిగేది. సమాచారం అందుకున్న నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ పరిస్థితిని సమీక్షించారు. బోటు తొలగింపునకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, కృష్ణపట్నం పోర్టు గస్తీ బృందం, ఫైర్, ఇరిగేషన్ అధికారుల బృందం అంతా కలిసి 30 టన్నుల బోటును బ్యారేజీకి ఎలాంటి నష్టం కలగకుండా ఒడ్డుకు చేర్చారు.
ఇవి కూడా చదవండి
మాడిపోయిన చపాతీలు పెట్టిన కోడలు.. మామ ఏం చేశాడంటే..
మొంథా తుపాన్ ఎఫెక్ట్.. 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం..