Share News

Anam Slams Jagan: ఉనికి కోల్పోతానన్న భయంతోనే అసత్యాలు.. జగన్‌పై మంత్రి సీరియస్

ABN , Publish Date - Nov 07 , 2025 | 04:35 PM

ప్రతిపక్ష నేత అర్హత కూడా జగన్ సంపాదించుకోలేక పోయారని మంత్రి ఆనం వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పని చేయకపోతే జగన్ అసెంబ్లీకి వచ్చి చర్చించాలని అన్నారు.

Anam Slams Jagan: ఉనికి కోల్పోతానన్న భయంతోనే అసత్యాలు.. జగన్‌పై మంత్రి సీరియస్
Anam Slams Jagan

ప్రకాశం, నవంబర్ 7: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ram Narayana Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌కు రైతుల మీద ప్రత్యేకమైన ప్రేమ పుట్టుకొచ్చిందంటూ ఎద్దేవా చేశారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఏ ఒక్క రైతును కూడా పరామర్శించ లేదని గుర్తుచేశారు. మొంథా తుఫానును ఎదుర్కొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అహర్నిశలు పని చేశారని తెలిపారు. తుఫాను సమయంలో ప్రభుత్వం బాగా పని చేసిందని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారన్నారు.


ఉనికి కోల్పోతానన్న భయంతో జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ప్రతిపక్ష నేత అర్హత కూడా జగన్ సంపాదించుకోలేక పోయారంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పని చేయకపోతే జగన్ అసెంబ్లీకి వచ్చి చర్చించాలని అన్నారు. జగన్ ప్రభుత్వంలో ఏం చేశారో... కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో అసెంబ్లీలో చర్చిస్తే ప్రజలకు తెలుస్తుందని మంత్రి చెప్పుకొచ్చారు.


జగన్ పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలను ప్రజలు కూడా మర్చిపోయారని అన్నారు. కొత్త జిల్లాలు, కొత్త రెవిన్యూ డివిజన్‌లు ఏర్పాటుపై మంత్రి వర్గ ఉప సంఘం పని చేస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

అక్టోబర్‌లో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..

ఆలూరులో వైసీపీకి షాక్.. బీజేపీలో భారీగా చేరికలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 07 , 2025 | 06:20 PM