Share News

Montha Cyclone Batters Prakasam District: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. ప్రకాశం జిల్లా అస్తవ్యస్తం..

ABN , Publish Date - Oct 28 , 2025 | 06:27 PM

భారీ వర్షాల కారణంగా చీరాల నుంచి పాకాల వరకు ఉన్న లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. చీరాలలో చేనేత మగ్గాలు కూడా నీట మునిగిపోయాయి. రబీ సీజన్‌లో వేసిన పంటలు పూర్తిగా నీట మునిగిపోయాయి.

Montha Cyclone Batters Prakasam District: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. ప్రకాశం జిల్లా అస్తవ్యస్తం..
Montha Cyclone Batters Prakasam District

మొంథా తుపాన్ (Montha Cyclone) ఎఫెక్ట్ ప్రకాశం జిల్లాపై చాలా తీవ్రంగా ఉంది. నిన్న చిరు జల్లులతో తుపాన్ ప్రభావం మొదలైంది. ఈ రోజు మేఘాల కారణంగా చీకట్లు కమ్ముకున్నాయి. భారీ వర్షాలు సైతం పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. భారీ వృక్షాలు నేల కొరుగుతున్నాయి. శింగరాయ కొండలో ఓ పెద్ద వృక్షం నేల కూలింది. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. సముద్ర తీర ప్రాంతాల్లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది.


ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతంలో కూడా తుపాన్ ప్రభావం(Montha Cyclone Batters Prakasam District) స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా కార్తీక మాసంలో కొత్తపట్నం బీచ్ భక్తులతో కలకల్లాడుతూ ఉండేది. కానీ, ఈ సారి తుపాన్ కారణంగా పర్యాటకులు, భక్తులు లేకుండా వెలవెలబోతోంది. ఇప్పటికే అధికారులు అలర్ట్ అయ్యారు. సముద్ర తీర ప్రాంతంలో ఉండే గ్రామాలకు హై అలర్ట్ ప్రకటించారు. గ్రామానికి ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ముంపునకు గురయ్యే అవకాశం ఉందని భావిస్తున్న 17 గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు.


భారీ వర్షాల కారణంగా చీరాల(Prakasam District Rain) నుంచి పాకాల వరకు ఉన్న లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. చీరాలలో చేనేత మగ్గాలు కూడా నీట మునిగిపోయాయి. రబీ సీజన్‌లో వేసిన పంటలు పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు రాత్రి భారీ వర్షాలు నమోదు అయితే పరిస్థితి ఏంటన్న భయంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సహాయక చర్యలకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు.


ఇవి కూడా చదవండి

ఏందమ్మా.. మిక్సీతో కూడా బట్టలు ఉతుకుతారా.. ఫన్నీ వీడియోపై నెటిజన్లు స్పందన ఏంటంటే..

రూ. 15 కోట్ల ‘షాబాజ్’.. రూ. 23 కోట్ల ‘అన్మోల్’

Updated Date - Oct 28 , 2025 | 06:41 PM