Pawan Kalyan: మీ సహకారానికి కృతజ్ఞతలు: పవన్ కళ్యాణ్
ABN , Publish Date - Aug 03 , 2025 | 09:35 AM
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి నిరంతర సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.

అమరావతి: మదనపల్లె-పీలేరు, కర్నూలు-మండలెం జాతీయ రహదారుల ప్రారంభోత్సవం అనంతరం ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి నిరంతర సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు. మదనపల్లె-పీలేరు, కర్నూలు-మండలెం చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ 2 జాతీయ రహదారులు రాయలసీమ ప్రాంత పురోగతిని వేగవంతం చేయడంలో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.
27 కొత్త జాతీయ రహదారులకు శంకుస్థాపన చేసినందుకు నితిన్ గడ్కరీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధిని సాధించడంలో ఈ 29 జాతీయ రహదారులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని గట్టిగా నమ్ముతున్నాని ఆశాభావం వ్యక్తం చేశారు.రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతర మద్దతు ఇస్తున్న ప్రధాని మోదీ గారికి, సీఎం చంద్రబాబు గారెకి నా హృదయపూర్వత కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
బీఈఎస్ఎస్‌కు ఈఆర్‌సీ గ్రీన్ సిగ్నల్
రెవెన్యూ లోటును సర్దుబాటు చేసుకుంటాం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి