Share News

Friendship Day: కష్ట, సుఖాల్లో తోడుగా ఉన్న నిన్ను మరువలేను నేస్తామా..

ABN , Publish Date - Aug 03 , 2025 | 07:41 AM

ఫ్రెండ్‌... ఒకే ఒక్క మాట మనసుకు ఎంతో సాంత్వనను ఇస్తుంది. కష్టాల్లో, బాధల్లో, ఒంటరితనంలో, సమూహంలో... మన అస్తిత్వానికి ఒక ప్రతిరూపం. సరైన ఫ్రెండ్‌ ఒక్కరున్నా చాలు... సంతోషాలకు చిరునామా దొరికినట్టే. నేడు (ఆగస్టు 3) ‘స్నేహితుల దినోత్సవం’. ఈ సందర్భంగా కొందరు తారలు తమ ప్రియ మిత్రుల గురించి, వారితో పెనవేసుకున్న మధుర స్మృతుల గురించి ఇలా పంచుకున్నారు ...

Friendship Day: కష్ట, సుఖాల్లో తోడుగా ఉన్న నిన్ను మరువలేను నేస్తామా..

- నేడు ‘స్నేహితుల దినోత్సవం’. ఈ సందర్భంగా..

ఫ్రెండ్‌... ఒకే ఒక్క మాట మనసుకు ఎంతో సాంత్వనను ఇస్తుంది. కష్టాల్లో, బాధల్లో, ఒంటరితనంలో, సమూహంలో... మన అస్తిత్వానికి ఒక ప్రతిరూపం. సరైన ఫ్రెండ్‌ ఒక్కరున్నా చాలు... సంతోషాలకు చిరునామా దొరికినట్టే. నేడు (ఆగస్టు 3) ‘స్నేహితుల దినోత్సవం’. ఈ సందర్భంగా కొందరు తారలు తమ ప్రియ మిత్రుల గురించి, వారితో పెనవేసుకున్న మధుర స్మృతుల గురించి ఇలా పంచుకున్నారు ...

ఒకరికొకరం...

book2.2.jfif

హైదరాబాద్‌లోని విద్యారణ్య హైస్కూల్‌లో చదువుకున్నప్పటి నుంచి నేనూ, దియా మీర్జా మంచి స్నేహితులం. వృత్తిరీత్యా బిజీగా ఉన్నా వేడుకలు, శుభకార్యాలకు కలుసుకుంటూనే ఉంటాం. హోలీ అంటే మా ఇద్దరికీ చిన్నప్పటి నుంచీ ఇష్టం. ఇప్పటికీ ప్రతీ ఏటా హోలీకి చిన్నపిల్లలమైపోతాం. ఎవరు బాధలో ఉన్నా.. ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటాం. అవసరాల్లోనూ తోడూనీడగా ఉంటాం.

- అదితీరావు హైదరీ


నా వెన్నంటే ఉన్నాడు

book2.4.jpg

నా దృష్టిలో స్నేహితుడంటే మన రహస్యాలు తెలిసినవాడు, పండగలకి శుభాకాంక్షలు తెలిపేవాడు కాదు. మన కష్టాలు తెలుసుకుని సాయం చేసేవాడు. భరోసాగా నిలిచేవాడు. అలాంటి వ్యక్తే నా ఫ్రెండ్‌ రాహుల్‌ రవీంద్రన్‌. నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు తను నావెంటే ఉన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాతోనే ఉంటూ జాగ్రత్తగా చూసుకున్నాడు. తను లేకుంటే ఈరోజు నేను ఇలా ఉండేదాన్ని కాదేమో. ఒక మంచి వ్యక్తికి వంద రెట్లు అధికం నా బెస్ట్‌ ఫ్రెండ్‌.

- సమంత


స్నేహితురాలే కాదు... అంతకుమించి...

book2.3.jpg

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సమయంలో మొదటిసారి మంచు లక్ష్మీని కలిశాను. ఆ సినిమా విడుదలైన తర్వాత నాకు ఫోన్‌ చేసి అభినందించిన మొట్టమొదటి వ్యక్తి తనే. ‘కరెంట్‌తీగ’ సినిమాకి మనోజ్‌ సరసన నా పేరును సూచించింది కూడా తనే. అలా మొదలైన మా స్నేహం ఇప్పటికీ అంతే స్వచ్ఛంగా కొనసాగుతోంది. నాకు ఏదైనా సమస్య వస్తే మొదటగా కాల్‌ చేసేది తనకే. నా గురించి లక్ష్మీకి పూర్తిగా తెలుసు. మా ఇద్దరి అభిరుచులు ఒకటే. కొన్నిసార్లు ప్రత్యేకించి తనని చూడటానికే హైదరాబాద్‌ వస్తుంటా. ఒకరి పట్ల ఒకరం ఎంతో కేరింగ్‌గా ఉంటాం. ప్రతీ సందర్భాన్ని కలిసే సెలబ్రేట్‌ చేసుకుంటాం. లక్ష్మీ నాకు కేవలం స్నేహితురాలు మాత్రమే కాదు... అంతకన్నా ఎక్కువ.

- రకుల్‌ ప్రీత్‌సింగ్‌


గర్వంగా ఉంటుంది

జీవితంలో కొన్ని విషయాలు స్నేహితుడితో మాత్రమే పంచుకోగలుగుతాం. నా జీవితంలో అలాంటి వ్యక్తి రామ్‌చరణ్‌. మేము పాఠశాల రోజుల నుంచే మంచి మిత్రులం. చిన్నప్పుడైతే చదువులో కన్నా అల్లరిలోనే ముందుండేవాళ్లం. ప్రేమ అందించడంలో, సాయం చేయడంలో తనెప్పుడూ ముందుంటాడు. నా సినిమా టీజర్‌, ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యిందంటే కచ్చితంగా తన నుంచి కాల్‌ వస్తుంది. పర్సనల్‌గా మాకు ‘ఫ్రెండ్స్‌ ఫర్‌ ఎవర్‌’ అనే వాట్సాప్‌ గ్రూప్‌ ఉంది. చరణ్‌ నా ప్రాణ స్నేహితుడు అని చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది.

- శర్వానంద్‌


స్వచ్ఛమైన స్నేహం మాది

2020లో చిన్నారుల కోసం ‘ఎడ్‌-ఎ-మమ్మా’ పేరిట పర్యావరణహిత దుస్తుల విక్రయం మొదలెట్టా. ఆ తర్వాత మెటర్నరీ వేర్‌ కూడా. అందులో ఈషా అంబానీ భాగస్వామి. మా ఇద్దరికీ అనుకోకుండా పరిచయం ఏర్పడినా... తర్వాత మంచి స్నేహితులయ్యాం. నేను నా పాప రాహాకి, ఈషా తన కవలలకు వారం వ్యవధిలో జన్మనిచ్చాం. ఆ సమయంలో మా అనుభవాలను ఒకరితో ఒకరం పంచుకున్నాం. తను అద్భుతమైన మహిళ. చాలా ప్రతిభావంతురాలు. స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి. అందుకే స్వచ్ఛమైన స్నేహం మాది.

- అలియా భట్‌

Updated Date - Aug 03 , 2025 | 07:41 AM