Chairman Pattabhiram : చెత్తాంధ్ర నుంచి స్వచ్ఛాంధ్రగా..!
ABN , Publish Date - Jan 20 , 2025 | 04:34 AM
రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం మిగిల్చిన చెత్తను తొలగించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని, రాష్ర్టాన్ని

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్
విజయవాడ, జనవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం మిగిల్చిన చెత్తను తొలగించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని, రాష్ర్టాన్ని చెత్తాంధ్ర నుంచి స్వచ్ఛాంధ్ర దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు వార్షిక ప్రణాళికలు రూపొందించుకున్నట్టు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలపై చెత్త పన్ను వేసి, వ్యర్థాల తొలగింపుపై దృష్టి సారించలేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 46.59 లక్షల టన్నుల (55 శాతం) చెత్తను తొలగించామని చెప్పారు. అక్టోబరు 2నాటికి 100శాతం చెత్తను తొలగిస్తామన్నారు.