Minister Narayana: మున్సిపాలిటీల నిధులు దారి మళ్లించారు.. జగన్‌పై మంత్రి నారాయణ విసుర్లు
ABN , Publish Date - Apr 19 , 2025 | 07:53 AM
Minister Narayana: ఏపీవ్యాప్తంగా స్వచ్చాంధ్ర - స్వచ్ఛదివస్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. అన్ని మున్సిపాలిటీల్లో ఇ - వేస్ట్ సేకరణ భారీగా చేయాలని సూచించారు.

అమరావతి: వైసీపీ ప్రభుత్వం చెత్తపన్నుపై పెట్టిన శ్రద్ధ పారిశుద్ధ్యంపై పెట్టలేదని మంత్రి నారాయణ మండిపడ్డారు. మున్సిపాలిటీల నిధులను కూడా జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. పన్నులతో వచ్చే ఆదాయాన్ని.. మున్సిపాలిటీల అభివృద్ధికే కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. స్వచ్చాంధ్ర - స్వచ్ఛదివస్ కార్యక్రమంపై మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లతో ఇవాళ(శనివారం) ఉదయం 6 గంటలకు మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్‌కు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండటంతో మొత్తం ఈ కార్యక్రమం బాధ్యతలు మంత్రి నారాయణకు అప్పగించారు. నెల్లూరులో లాంఛనంగా మంత్రి నారాయణ ప్రారంభించారు.
ముందుగా అల్లీపురంలోని డంపింగ్ కేంద్రాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. ఏపీవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అధికారులకు నారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.... అన్ని మున్సిపాలిటీల్లో ఈ - వేస్ట్ సేకరణ భారీగా చేయాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యేలు, అన్ని శాఖల అధికారులు, ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ - వేస్ట్ సేకరణ నిరంతరం జరిగేలా కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై ర్యాలీ నిర్వాహణ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. ఈరోజు నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తనకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. స్వచ్చంద్ర - స్వచ్ఛ దివస్ నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా ఉండవద్దని మంత్రి నారాయణ ఆదేశించారు.
నెల్లూరులో స్వర్ణ ఆంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ...
నెల్లూరు: నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో శనివారం నాడు స్వర్ణ ఆంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ తీశారు. వీఆర్సీ కూడలి నుంచి నర్తకి సెంటర్ వరకు ఈ ర్యాలీ సాగింది. ర్యాలీలో నగర ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వేస్ట్‌పై పోరాటం చేయాలని నారాయణ పిలుపుకు విశేష స్పందన వచ్చింది. నర్తకి సెంటర్‌లో ఈ వేస్ట్ సేకరణ వాహనాలను మంత్రి నారాయణ ప్రారంభించారు. విద్యార్థిని, విద్యార్థులు, ప్రజల చేత మంత్రి నారాయణ స్వర్ణ ఆంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. మనస్సు స్వచ్ఛంగా ఉండి.. ఇళ్లు, పరిసరాలు స్వచ్ఛంగా ఉంటే అదే స్వచ్ఛత అని మంత్రి నారాయణ తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచనలకు అనుగుణంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛ కార్యక్రమం చేపట్టారని మంత్రి నారాయణ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశాల్లో ఉండటంతో ఏపీ వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు. 2014 నుంచి 2019 వరకు స్వచ్ఛ కార్యక్రమం సరిగానే జరిగిందని తెలిపారు. 2019 నుంచి గత జగన్ ప్రభుత్వం స్వచ్ఛ కార్యక్రమాన్ని వదిలేసిందని అన్నారు. గత ఐదేళ్లు చెత్తపై చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం నడిచిందని ఆరోపించారు. గత జగన్ ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్త మనకు ఇచ్చి వెళ్లిందని అన్నారు. ముఖ్యమంత్రి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రాష్ట్రంలో ఉన్న చెత్త శుభ్రం చేయాలని ఆదేశించారని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
TTD Donation Management: గోవిందుడి ఖజానా మరింత భద్రం
Minister NMD Farooq: మైనార్టీలకిచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యం
Kasireddy Rajasekhar Reddy: ముందస్తు బెయిలివ్వండి అరెస్టు నుంచి కాపాడండి
Read Latest AP News And Telugu News