Minister Narayana: ఎమ్మెల్యే కోటంరెడ్డితో మంత్రి నారాయణ భేటీ.. ఏం చర్చించారంటే..
ABN , Publish Date - Feb 01 , 2025 | 08:00 PM
Minister Narayana: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సమయంలో పేదల కళ్లల్లో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందని మంత్రి నారాయణ అన్నారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. మిగిలిన హామీలు సైతం త్వరితగతిన అమలు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

నెల్లూరు: ఒక్క నెల్లూరులోనే రూ.120 కోట్ల ట్యాక్స్ పెండింగులో ఉందని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో పెన్షన్ల పంపిణీలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు. నెల్లూరు నగరంలో మున్సిపల్ కమిషనర్ వర్సెస్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివాదం అవస్తవమని చెప్పారు. చట్టాలకు అనుగుణంగా అధికారులు పని చేస్తారని అన్నారు. అధికారులకు రూల్ పొజిషన్ ప్రకారమే నడుచుకోమని చెప్పామని అన్నారు. ట్యాక్స్ విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సమయం ఇవ్వడంతో పాటు నెల వాయిదాల్లో కట్టమన్నామని మంత్రి నారాయణ చెప్పారు.
ప్రజలు కట్టాల్సిన ట్యాక్స్ విషయంలో ఆలస్యం అయితే సిస్టం ఎలా నడుస్తుందని అడిగారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ప్రజల నాడి ఆయనకు బాగా తెలుసునని చెప్పారు. ప్రజలు ట్యాక్స్ కడితే వారికి కావాల్సిన వసతులు వస్తాయని తెలిపారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిన ఇచ్చిన మాటకు ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సమయంలో పేదల కళ్లల్లో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. మిగిలిన హామీలు సైతం త్వరితగతిన అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. డిప్యూటీ మేయర్ నియమకంపై కార్పొరేటర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు.
ఏ నిర్ణయమైనా కట్టుబడి ఉంటాం: ఎమ్మెల్యే కోటంరెడ్డి
మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ఇవాళ(శనివారం) భేటీ అయ్యారు. గంట పాటు ఈ సమావేశం సాగింది. నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక పై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. నగర డిప్యూటీ మేయర్ నియామకంలో మంత్రి నారాయణ నిర్ణయం అంతిమమని చెప్పారు. మంత్రి నారాయణ ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CII on Budget 2025: దేశానికి ప్రోత్సాహకంగా బడ్జెట్.. సీఐఐ రియాక్షన్
Union Budget 2025-26: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ
CM Chandrababu: ఏపీ రైతులకు శుభవార్త.. అప్పటి నుంచే రైతు భరోసా
Read Latest AP News And Telugu News