Share News

CM Chandrababu: నెల్లూరులో అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం

ABN , Publish Date - Feb 15 , 2025 | 07:35 AM

CM Chandrababu Naidu: నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్‌లో కందుకూరుకు సీఎం బయలుదేరనున్నారు. ఉదయం 11.45 గంటలకు కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

CM Chandrababu: నెల్లూరులో అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం
CM Chandrababu Naidu

నెల్లూరు : నెల్లూరు జిల్లాలోని కందుకూరులో ఇవాళ (శనివారం) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. కందుకూరు మండలం దూబగుంటలో ‘‘స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్’’ కార్యక్రమానికి హాజరవుతారు. దూబగుంట గ్రామంలో స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైంది.


ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్‌లో కందుకూరుకు సీఎం బయలుదేరనున్నారు. ఉదయం 11.45 గంటలకు కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.05 దూబగుంట శివారులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటేషన్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. 12.20 గంటలకు దూబగుంట గ్రామస్తులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. 1:30 గంటలకు వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. 2:40 గంటలకు సీఎం చంద్రబాబు హెలికాఫ్టర్‌లో ఉండవల్లి బయలు దేరి వెళ్లనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu : నేరుగా అర్జీదారుల వద్దకే!

Transgender Welfare: రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు

Nimmala Ramanaidu : ఆ ట్వీట్‌ జగన్‌ నేర స్వభావాన్ని చాటుతోంది

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 15 , 2025 | 08:12 AM